జాతీయ వార్తలు

యూపీ రైతులు ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని కోరుతూ యూపీ రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఢిల్లీ వైపుగా సాగింది. భారతీయ కిసాన్ సంఘటన ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దిశగా బయలుదేరింది. పంట‌ల‌కు కూడా రుణ‌మాఫీని ప్ర‌క‌టించాల‌ని రైతులు కోరుతున్నారు. ఢిల్లీ-యూపీ బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న ఘాజీపూర్‌లో పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కిసాన్ ఘాట్ వైపు వ‌స్తున్న రైతుల‌ను అడ్డుకునేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. త‌మ డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపితే, తాము తిరిగి వెన‌క్కి వెళ్తామ‌ని భార‌తీయ కిసాన్ సంఘ్ అధ్య‌క్షుడు పురాన్ సింగ్ తెలిపారు.