హైదరాబాద్

గ్రేటర్‌లో విజయం కోసం తెరాస ప్రభుత్వ అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నవంబర్ 24: తెరాస ప్రభుత్వం గెలుపుకోసం గ్రేటర్‌లో అక్రమాలకు పాల్పడుతుందని తెదేపా, బిజెపి నేతలు పేర్కొన్నారు. మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఓటర్ల తొలగింపు డివిజన్‌ల కుదింపు బిసి ఓటర్ల గుర్తింపులో అక్రమాలపై నిరసనదీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, టిడిపి నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి, సాయన్న, ఎంఎన్ శ్రీనివాస్, బిజెపి శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి, డాక్టర్.లక్ష్మన్, చింతల రాంచద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, వెంకటరమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వారు తప్పుబట్టారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ఉద్దేశ్యంతో ఎంఐఎంతో కుమ్మకై ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు. ముందు 200 డివిజన్‌లుగా విభజిస్తామని చెప్పి సర్వేలు తమకు అనుకూలంగా లేవని తెలుసుకుని 150 డివిజన్‌లను అదే విధంగా ఉంచకుండా ఇష్టానుసారంగా మార్పులు చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని అన్నారు. మరోవైపు తొలగించిన ఓటర్లకు న్యాయం చేయకుండానే మరోవైపు బిసి ఓటర్ల కోసం నిర్వహిస్తున్న సర్వేలో సైతం తీరని అన్యాయం చేశారని అన్నారు. ఎక్కడ సర్వేలు చేయకుండా తూతూ మంత్రంగా వివరాలు చేపట్టి బిసిలకు అన్యాయం చేస్తూ సర్వే అయిందని అనిపించుకున్నారని అన్నారు. తాము చేస్తున్న ఆరోపణలో వాస్తవాలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికి ప్రభుత్వం ఏకపక్షం వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. కేవలం ఎంఐఎంతోనే మంతనాలు జరుపుతూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అనేక అవకతవకలకు పాల్పడుతుందని అన్నారు. తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా లెక్కచేయడం లేదని 25 బిసి కులాలను ఓసిలుగా బిసిల ప్రాముఖ్యతను తగ్గించిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలకు స్వస్తిపలికి చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే పెద్దయెత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కూన వెంకటేశ్‌గౌడ్, మేకల సారంగపాణి, వనంరమేశ్, భజరంగ్‌శర్మ, పి.సాయిబాబ, ప్రదీప్‌చౌదరి, కిశోర్, జలేందర్‌రెడ్డి, నారపాకనగేశ్, కొమురన్న, బిజెపి నాయకులు రవిప్రసాద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.