హైదరాబాద్

గ్రామ పంచాయతీ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఫిబ్రవరి 14: మూడు దశాబ్దాలుగా దుర్భర జీవితం కొనసాగిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్స్ ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు రాజారపు ప్రతాప్, అధ్యక్షుడు భువనగిరి శ్రీనివాస్‌గుప్త, ప్రధాన కార్యదర్శి బైరి సుభాష్ మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం రూ.15వేలు కనీస వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1083 అదనపు పంచాయతీ కార్యదర్శులు, 456 రికార్డ్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులలో హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఖాళీగా ఉన్న 964 మంది, కారోబార్ బిల్‌కలెక్టర్లకు వారి అర్హత అధారంగా పదోన్నతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శంకరయ్య, రవీందర్ పాల్గొన్నారు.