హైదరాబాద్

‘డబుల్’ గాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేతలకు సీట్లు, టికెట్ల ఎర
ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల ఆశలు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు

హైదరాబాద్, డిసెంబర్ 17: మహానగర పాలక సంస్థ ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న జిహెచ్‌ఎంసి డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు, నోటిఫికేషన్ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో గెలుపొందేందుకు వీలుగా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి.
అంతేగాక, పలు పార్టీలు ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి పనులతో అధికార తెరాస పార్టీ దూసుకెళ్తుండగా, అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు వంటివి చేపడుతూ బిజెపి, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్వరాష్ట్రంలో ప్రతి పేదవారు డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసించాలన్న మహాసంకల్పంతో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు వివిధ పార్టీలకు చెందిన నేతల ప్రచారానికి ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి.
అధికార, విపక్షాలంటూ తేడా లేకుండా తమను గెలిపిస్తే ఆహార భద్రత కార్డు కల్గిన అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పిస్తామని ప్రజలను ఆకట్టుకునేందుకు ఎవరి తంటాలు వారు పడుతున్నాయి. ఇక అధికార తెరాస పార్టీ ఎలాగైనా గ్రేటర్‌పై గులాబీ జెండాను ఎగురవేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నియోజకవర్గం, డివిజన్ స్థాయి నేతలకు టికెట్ల ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. స్వరాష్ట్ర సిద్ధించిన తర్వాత కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా తెరాస అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా, ఇప్పటి వరకు ఆ పార్టీ కనీసం నగర కమిటీలను కూడా నియమించుకోలేదు. అయినా తన ముందున్న గ్రేటర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు నగరంలో కాస్త పట్టుకున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు చివరి సమయంలో తమ పార్టీలో చేరేలా ‘ఆకర్షి’తలు కాకపోరా అన్న ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తెరాస పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు సైతం తమను గెలిపిస్తే డివిజన్‌లోని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పిస్తామని చెప్పుకొస్తున్నారు. నేతలెన్ని ప్రయత్నాలు చేసినా, వీరిలో టికెట్లు ఎంత మందికి దక్కుతాయో, ఎంత మంది కార్పొరేటర్లుగా ఎన్నికవుతారో వేచి చూడాలి!