జాతీయ వార్తలు

గయ కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్సీ మనోరమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ: బిహార్‌లో అధికార జెడియు పార్టీ ఎమ్మెల్సీ మనోరమ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడి మంగళవారం ఉదయం గయ కోర్టులో లొంగిపోయారు. ఆమెను అరెస్టు చేసేందుకు న్యాయస్థానం ఇదివరకే వారంట్ జారీ చేసింది. మనోరమ ఇంట్లో మద్యం సీసాలు లభించడంతో ఆమెను జెడియు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సాక్షాత్తూ బిహార్ సిఎం నితీష్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. మనోరమ కుమారుడు రాకీ యాదవ్ కొద్దిరోజుల క్రితం నడిరోడ్డుపై ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని తుపాకీతో కాల్చి చంపాడు. రాకీ కోసం గాలిస్తున్న పోలీసులకు మనోరమ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలు లభించాయి. కోర్టులో లొంగిపోయిన ఆమెకు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు. మనోరమ కుమారుడు రాకీ, భర్త బిందీ యాదవ్ కూడా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.