క్రీడాభూమి

సౌరెజ్ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లా లిగాలో రియల్ మాడ్రిడ్‌పై బార్సిలోనా గెలుపు
మాడ్రిడ్, నవంబర్ 22: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగా ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా రియల్ మాడ్రిడ్, బార్సిలోనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. లూయిస్ సౌరెజ్ రెండు గోల్స్‌తో రాణించగా, నేమార్, ఆండ్రియాస్ ఇనెస్టా చెరొక గోల్ సాధించారు. మ్యాచ్ ఆరంభం నుంచే బార్సిలోనా సర్వశక్తులు ఒడ్డి పోరాటాన్ని కొనసాగించగా, రియల్ మాడ్రిడ్ ఆత్మరక్షణలో పడింది. 11వ నిమిషంలో సౌరెజ్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన బార్సిలోనాకు 39వ నిమిషంలో నేమార్ మరో గోల్‌ను అందించాడు. ఇనెస్టా 53వ నిమిషంలో గోల్ సంపాదించిపెట్టగా, సౌరెజ్ 74వ నిమిషంలో మరో గోల్ చేశాడు. బార్సిలోనా గోల్స్ వేటలో పడగా, వారిని ఆడ్డుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చిన రియల్ మాడ్రిడ్ గోల్స్ వేటలో విఫలమైంది.ఇతర మ్యాచ్‌ల్లో, సెవిల్లాను రియల్ సోసియేడెడ్ 2-0 తేడాతో ఓడించింది. మలగాపై ఎస్పానియల్ 2-0 ఆధిక్యంతో విజయం సాధించింది. సెల్టా విగోపై డెపెర్టివో లా కొర్మ కూడా అదే తేడాతో గెలిచింది. వలెన్షియా, పల్మాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి.