జాతీయ వార్తలు

ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో కోర్టు రవి కపూర్‌, అమిత్‌ శుక్లాలకు మరణ శిక్ష, బల్‌జీత్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. 2009లో దిల్లీలో వసంత్‌ విహార్‌ ప్రాంతంలోని తన నివాసం వద్ద నుంచి దుండగులు జిగీషను కిడ్నాప్‌ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. సూరజ్‌కుండ్‌ ప్రాంతంలో మూడు రోజుల తర్వాత జిగీష మృతదేహం లభ్యమైంది. జిగీష నుంచి డెబిట్‌కార్డు దొంగిలించిన దుండగులు షాపింగ్‌ చెయ్యడంతో సీసీటీవీ కెమెరాల దృశ్యాల ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ కేసులో రవి కపూర్‌, బల్‌జీత్‌, అమిత్‌ శుక్లాలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కోర్టు రవి కపూర్‌, అమిత్‌ శుక్లాలకు మరణ శిక్ష, బల్‌జీత్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది.