గుంటూరు

అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవనాలకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూన్ 7: నియోజకవర్గంలో శాశ్వత భవనాలకు నోచుకోని అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఐసిడియస్ పిడి నిర్మల అధ్యక్షత వహించారు. యుద్ధ ప్రాతిపదికన నిర్వహించి చేపట్టిన 20 వేల మరుగుదొడ్ల నిర్మాణాలలో అంగన్‌వాడీల పాత్ర చెప్పుకోదగినదని అన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్య సంరక్షణ బాధ్యత వెయ్యిరోజులపాటు తట్లితండ్రులతోపాటు అంగన్‌వాడీలపైన కూడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, యార్డు కారక్యదర్శి రహిమాన్, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, యార్డు వైస్ చైర్మన్ తోడేటి రవి, డిసి చైర్మన్ తుమ్మల ఏడుకొండలు, ఎంపీపీలు బొర్రా కోటేశ్వరరావు, ఉమాదేవి పార్టీ అధ్యక్షులు కోమటినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, పూజల చినవెంకట కోటయ్య పాల్గొన్నారు.