గుంటూరు

జూట్‌మిల్లుకు ఇచ్చిన ప్లాన్‌ను రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 7: భజరంగ్ జూట్‌మిల్లుకు సంబంధించిన 5 ఎకరాల 28 శెంట్లలో ఉన్న స్థలానికి మునిసిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ప్లాన్‌లో అనేక అవకతవకలు ఉన్నాయని, తక్షణం ప్లాన్‌ను రద్దుచేయాలని జూట్‌మిల్లు పరిరక్షణ సమితి నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మికి విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఈ మేరకు కమిషనర్‌ను ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ స్థలానికి సంబంధించి కొలతలు గానీ, అక్కడ ఉన్న కట్టడాలు, పురాతన దేవాలయ తదితరాలను చూపించలేదని అన్నారు. ఇదే విషయాన్ని గత నెల 12వ తేదీన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మంత్రి పుల్లారావు దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. దీనిపై మంత్రి స్పందించి అవకతవకలు ఉంటే రద్దుచేయాలని ఆదేశించారని తెలిపారు. తక్షణం స్థలాన్ని పరిశీలించి ప్లాన్‌ను రద్దుచేయాలని కోరారు. అంతకముందు వెస్ట్ సర్కిల్ డిఎస్‌పిని కలిసి మిల్లు నుండి అక్రమంగా ముడిసరుకు, యంత్రసామగ్రిని తరలించే ఫ్రయత్నాలు చేస్తున్నారంటూ, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమితి నాయకులు జంగాల అజయ్‌కుమార్, భావన్నారాయణ, మాల్యాద్రి, ఎబ్బూరి పాండురంగ తదితరులున్నారు.