గుంటూరు

అభినవ అశోకుడు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 7: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగుతోందని , రెండేళ్లుగా చంద్రబాబు శ్రామికుడిగా తీరిక లేకుండా శ్రమిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నవ నిర్మాణదీక్ష వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అధికారి నాగశివరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కిషోర్‌బాబు ప్రసంగిస్తూ ఐదుకోట్ల మంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా చేయాలని, అశోక్ చక్రవర్తి పాలన స్ఫూర్తిగా పనిచేస్తున్న చంద్రబాబు అభినవ అశోకుడని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడని, జగన్ పిచ్చాసుపత్రికో, జైలుకో వెళ్లడం ఖాయమని మంత్రి రావెల అన్నారు. గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రానికి కష్టాలు ఉన్నాయని, అప్పులు మిగిలాయని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీపీ ప్రజాపాలనను అడ్డుకుంటున్నారని, జగన్ గ్యాంగ్ ఒక మాఫియాలా తయారయిందని, జైలుజీవితం గడిపి వెలుపలికి వచ్చిన జగన్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, మంగళగిరి, తాడేపల్లి జడ్‌పిటిసిలు ఆకుల జయసత్య, దండమూడి, మంగళగిరి, దుగ్గిరాల ఎఎంసి చైర్మన్‌లు ఆరుద్ర భూలక్ష్మి, వంగా సాంబిరెడ్డి, ఎంపిడిఓలు పద్మావతి, వీరాంజనేయులు, ఆప్కో చైర్మన్ ఎం హనుమంతరావు, కమిషనర్ టీవీ రంగారావు, జందు సాంబశివుడు తదితరులు ప్రసంగించారు. 79 మహిళా గ్రూపులకు 7 లక్షల 90 వేల రూపాయల చెక్కును మంత్రి రావెల, ఎంపి గల్లా అందజేశారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఎంపీ గల్లా జయదేవ్ పరిశీలించారు.