గుంటూరు

నామినేటెడ్ భర్తీలో ఏపీదే ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 9: తెలంగాణ ప్రభుత్వం కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకాలతో పాటు నామినేటడ్ పదవులను ఎక్కువగా భర్తీచేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. గురువారం రాత్రి పొద్దుపోయాక రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో పిచ్చాపాటిగా రెండు నిముషాలు మాట్లాడారు. గుంటూరు మిర్చియార్డు పదవులకు ఎక్కువ మంది పార్టీ నుండి తలపడుతున్నందున ఎటువంటి విభేదాలు తలెత్తకుండా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, ఏకాభిప్రాయంతో నియామకాలు జరుపుతామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును బట్టే ర్యాంకులు కేటాయించడం జరుగుతోందని, దాని వలన వారు పనితీరు మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయం కన్నా గుంటూరు పార్టీ కార్యాలయం విశాలవంతంగా ఉండటంతే రాష్ట్ర పార్టీ కార్యాలయంగా ఏర్పాటుచేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖఫట్నంలో కూడా విశాలవంతమైన పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని, త్వరలోనే జిల్లాలో కూడా జాతీయ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని లోకేష్ చెప్పారు.

పాఠశాల బస్సును ఢీకొన్న బైక్: ఒకరి మృతి
భట్టిప్రోలు, జూన్ 9: ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు పక్కనే ఆగి ఉన్న ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన భట్టిప్రోలులో గురువారం సాయంత్రం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం కొల్లూరు మండలం కోటిపల్లికి చెందిన దోనేపూడి ప్రభుదాస్ (21), నాగరాజు అనే ఇద్దరు యువకులు కోటిపల్లిలో జరిగిన వివాహ వేడుకలకు వెళ్ళి తిరిగి బైకుపై భట్టిప్రోలు వైపు వస్తుండగా వెల్లటూరు - భట్టిప్రోలు గ్రామాల మధ్య విశ్శశాంతి స్కూల్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన బస్సును ఢీకొన్నారు. దీంతో తలకు తీవ్ర గాయాలైన ప్రభుదాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు నుజ్జునుజ్జయింది. నాగరాజు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా చికిత్స కోసం గుంటూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రారెడ్డి తెలిపారు.