గుంటూరు

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూన్ 9: దేశ, సమాజాభివృద్ధిలో మహిళలు కీలకభూమిక పోషించకుంటే ఆ సమాజం పురోగమించదని జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైలుపేటలోని శ్రీ సత్యసాయి విద్యానికేతన్‌లో సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సుకు విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ మాట్లాడుతూ సనాతన భారతీయ ధర్మంలో స్ర్తిలకు మహోన్నతమైన పాత్ర ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. నేటి ఆధునిక యుగంలో కూడా మహిళలు బహుముఖీయ పాత్ర పోషిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారన్నారు. పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యాబోధన అందిచండం ద్వారానే సమాజం నైతికంగా మరింత పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా సత్యసాయి విద్యానికేతన్ ఆ బాటలో పయనించడం అభినందనీయమన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకురాలు అనూరాధ, బిఆర్ బిఇడి కళాశాల కరస్పాండెంట్ అన్నపూర్ణ, ఎస్ భావన, బేబి సుజాత, సాయి సుధ పాల్గొన్నారు.