గుంటూరు

గుంటూరులో కాపునాడు కార్యకర్తల బైండోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 9: కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్‌తో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పెద్ద ఎత్తున కాపునాడు కార్యకర్తలను బైండోవరు చేశారు. నగరంపాలెం, లాలాపేట, పాత గుంటూరు, కొత్తపేట పోలీసుస్టేషన్ల పరిధిలో 100 మందికి పైగా కార్యకర్తల నుంచి లిఖితపూర్వకమైన పత్రాలను తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపునాడు కార్యకర్తల ఇళ్ల దగ్గర పోలీసులు నిఘావేసి స్టేషన్లకు తరలించారు. దీంతో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. గతంలో కాపునాడు ఉద్యమం తరపున ఆందోళన చేసినవారితో పాటు మరికొందరు అమాయకులపై కూడా బైండోవరు కేసులు బనాయించారని కాపు యువత నాయకులు ఆరోపించారు. ఇలా ఉండగా ముద్రగడతో పాటు రాష్టవ్య్రాప్తంగా కాపునాడు నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌లను నిరసిస్తూ గుంటూరులో ఆందోళన నిర్వహించేందుకు కాపుసంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమం చేస్తూ స్వచ్చందంగా తనంతటతానే ఏ నేరం చేయకపోయినా లొంగిపోయిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షను భగ్నం చేయడాన్ని కాపు యువత జీర్ణించుకోలేక పోతున్నారు. పలుచోట్ల ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వానికి తగిన సంకేతం పంపాలని పిలుపునిచ్చారు. ముద్రగడ అరెస్ట్, అక్రమ బైండోవర్ కేసులకు నిరసనగా శుక్రవారం గుంటూరు నగరంపాలెం వంగవీటి రంగా సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు యువత నాయకులు ఆళ్ల హరి, గోళ్ల సత్యనారాయణ, దాసరి శ్రీనివాసరావు తెలిపారు.