గుంటూరు

అనుమానాస్పద స్థితిలో యువ క్రీడాకారుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, జూన్ 10: నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు కలకత్తాలో ఉరివేసుకొని అనుమానాస్పది స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉప్పలపాడు గ్రామానికి చెందిన సామినేని ఫణీంద్ర (23) గుంటూరు జెకేసీ కళాశాలలో బీకాం పూర్తి చేసుకున్నాడు. క్రీడల పట్ల ఫణీంద్రకు ఆసక్తి ఉండటంతో గుంటూరులో శిక్షణ పొందాడు. ఫణీంద్ర టాలెంట్‌ను గమనించిన కళాశాల పీఈటీ కలకత్తాలోని ఓ ప్రైవేటు క్రికెట్ అకాడమీలో ఫణీంద్రను ఎనిమిది నెలల కిందట చేర్పించారు. అప్పటి నుండి ఫణీంద్ర శిక్షణ పొందుతూ ఉన్నాడు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చూపాడు. సోమవారం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొని కలకత్తా చేరుకొని చివరిసారిగా సోమవారం తనతో మాట్లాడాడని ఫణీంద్ర తల్లి అంజమ్మ విలేఖరులకు తెలిపారు. గురువారం రాత్రి కలకత్తా పోలీసులు వెల్దుర్తి ఎస్‌ఐ రవికృష్ణకు ఫోన్ ద్వారా ఫణీంద్ర ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సమాచారం అందించారు. ఎస్‌ఐ రవికృష్ణ గ్రామానికి చేరుకొని ఫణీంద్ర తల్లిదండ్రులు అంజమ్మ, వెకంటేశ్వరరావులకు విషయం తెలిపారు. ఫణీంద్ర సోదరుడు కోటేశ్వరరావు బంధువులతో కలసి హైదరాబాదు చేరుకొని ఫణీంద్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు విమానంలో కలకత్తా బయలుదేరి వెళ్లారు.