గుంటూరు

రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై ఎమ్మెల్యే ఆర్కే ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 10: రాజధాని గ్రామాల్లో ఎన్‌ఓసి ఉంటేనే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శుక్రవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు.
సబ్ రిజిస్ట్రార్ బెజ్జం నాగేశ్వరరావుతో ఆయన చర్చించారు. ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ మాత్రమే నిలిపామని, మిగతా రిజిస్ట్రేషన్లు యథావిధిగా చేస్తున్నామని ఆయన వివరించారు.
ఈ నెలాఖరునుంచి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు సక్రమంగా జరిగే దానికి వీలుగా రిజిస్ట్రేషన్లను నిలిపి వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపిపి పచ్చల రత్నకుమారి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.