గుంటూరు

తెనాలి వైద్యశాలలో అంతర్జాతీయ వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 10: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వైద్య సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సి టీమ్ లీడర్ డాక్టర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆసుపత్రిలోని పిల్లల వార్డు, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, క్యాజువాలజీ వార్డులను పరిశీలించారు. ఆధునాతన పరికరాలు వినియోగం, రోగులకు అందిస్తున్న సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వరప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెనాలి, వేమూరు, కొల్లూరు, కూచిపూడి వైద్యశాలల వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ అనిల్‌కుమార్ డిజిటల్ వీడియో సెక్టార్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్యశాలలో ఏర్పాటు చేయనున్న వసతులు, వైద్య పరికరాల ఏర్పాట్లు, వైద్యసేవల నిర్వహణ, ఫార్మసీ మెయింట్‌నెన్స్ వంటి అనేక అంశాలను ప్రాక్టికల్‌గా చూపించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్యసేవలు నాణ్యమైనవిగా ఉంటే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుండి ఆసుపత్రి అభివృద్ధికోసం 5కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉందన్నారు. ఈనిధులతో జిల్లా స్థాయికి సమానమైన వైద్యశాలను నిర్వహించవచ్చునని చెప్పారు. అలాగే తెనాలి ఆసుపత్రి పరిధిలోని కొల్లూరు, వేమూరు, కూచిపూడి పిహెచ్‌సిలను సిహెచ్‌సిలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాలను వైద్యులు, సిబ్బంది సద్వినియోగం చేసుకుంటూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించి ఉత్తమ వైద్యశాలగా తీర్చిదిద్దేంకు తమవంతు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిఎంఅండ్ హెచ్‌ఓ ఎఓ రామారావు, పిఐ శ్యామలాదేవి, శ్రీలత, ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.