గుంటూరు

రైతుల ఆత్మహత్యలన్నీ పాలకుల హత్యలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 10: దేశంలో, రాష్ట్రంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ పాలకులు చేస్తున్న హత్యలేనని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలుత పురవీధుల గుండా సంఘ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అగ్రభాగాన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఝాన్సీ, కె కోటయ్య, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం బళ్లారి రాఘవ ఓపెన్ ఆడిటోరియంలోజరిగిన బహిరంగ సభలో ఝాన్సీ మాట్లాడుతూ నేడు వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పాలకులు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలే కారణమన్నారు. రైతులను రుణభారం నుంచి విముక్తులను చేసినప్పుడే వ్యవసాయరంగం మరింత పురోగమిస్తుందన్నారు. మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు, డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ జాతీయోద్యమ కాలం నుంచి పోరాట వారసత్వం కల్గిన గుంటూరు జిల్లాలో ఈ మహాసభలు నిర్వహించుకోవడం సముచితంగా ఉందన్నారు. వలస వాదుల పాలన కాలంలో కనె్నగంటి హనుమంతు నాయకత్వంలో సాగిన పుల్లరి వ్యతిరేక పోరాటం, పెదనందిపాడు, చీరాల-పేరాల పన్నుల వ్యతిరేక సహాయ నిరాకరణోద్యమాలు జరిగాయన్నారు. ఎఐఎఫ్‌టియు ప్రధాన కార్యదర్శి అరవింద్ సిన్హా మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పాలకులందరూ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప వ్యవసాయరంగం పటిష్ఠతకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సామ్రాజ్యవాద దోపిడీ విధానాల ఫలితంగా రైతులు అప్పుల పాలవుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయకుమార్ మాట్లాడుతూ రాజధాని కోసమంటూ మూడు పంటలు పండే 33 వేల ఎకరాలను సమీకరణ పేరిట రైతుల నుండి తీసుకోవడం అమానుషమన్నారు. ఈ సభలో ఆర్‌పిఐ రాష్ట్ర అధ్యక్షుడు పి అంజయ్య, శంభు మెహతో (జార్ఖండ్), ఎస్‌డి బోస్ (బీహార్), విందై దేవందన్ (తమిళనాడు), చాగనూరు మల్లిఖార్జున (కర్ణాటక)తో పాటు ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చిన ఎఐకెఎంఎస్ ప్రతినిధులు సభల్లో సందేశమిచ్చారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి కె కోటయ్య, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, రాష్టక్రార్యవర్గ సభ్యులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావులు ఏర్పాట్లను పరిశీలించారు.