కర్నూల్

పట్టాలు తప్పిన గూడ్సు రైలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తప్పిన ప్రాణాపాయం..
* ఆలస్యంగా నడచిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
* పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు..
డోన్, మార్చి 7: డోన్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం గూడ్సురైలు పట్టాలు తప్పింది. రైల్వేస్టేషన్ సమీపంలోనే గూడ్సుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పగా మరో బోగీ పల్టీ కొట్టింది. దీంతో ఓ బోగీ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అంతరాయం ఏర్పడడంతో డోన్ మీదుగా నడిచే కర్నాటక, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గుంతకల్లు సమీపంలోని తోరణగల్లులో బొగ్గులోడుతో వెళ్లిన బాక్సెన్ 58 గూడ్స్ రైలు అన్‌లోడ్ చేసింది. అయితే 20వ వ్యాగెన్‌లో సగం లోడును మాత్రమే అన్‌లోడ్ చేసి, మిగతా సగాన్ని అందులోనే వుంచారు. బొగ్గు లోడును దిగుమతి చేశారనే ఉద్దేశ్యంతో గూడ్స్‌రైలును గుంతకల్లు నుంచి నంద్యాలకు లోడింగ్ కోసం పంపారు. గూడ్స్‌రైలు డోన్ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా 5 ఎ, 5బి క్రాస్ వద్ద 298 కి.మీ సమీపంలో 20వ బోగీ పల్టీ కొట్టింది. దీంతో 21,22 బోగీలు అదుపు తప్పి పట్టాలు దిగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై గూడ్సురైలను నిలిపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. అర కి.మీ దూరంలోనే వున్న రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగి వుంటే భారీగా ప్రాణనష్టం జరిగి వుండేదని స్టేషన్ సమీపంలోనే సంఘటన జరగడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే గుంతకల్లు రైల్వే డివిజన్ సేఫ్టీ అధికారి హరి ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఏపి సంపర్క్ క్రాం తి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌ను డోన్‌కు తరలించి ఆగిపోయిన గూడ్సు రైలును మల్లియాలకు మళ్లించి లైన్‌ను క్లియర్ చేశారు.
ఆలస్యంగా నడిచిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
డోన్ స్టేషన్ సమీపంలో గూడ్స్‌రైలు పట్టాలు తప్పడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు 2 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను బోగోలు, తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్లే ఏపి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును మల్లియాలలో నిలిపి వేశారు. డోన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరాల్సిన రైళ్లు సుమారు 2 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. అలాగే కర్నూలు నుంచి బళ్లారి, డోన్ నుంచి గుత్తి, గుత్తి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని, సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
బనగానపల్లె, మార్చి 7:మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామానికి చెందిన ఇబ్రహీం (54) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు ఎస్‌ఐ జయన్న తెలిపారు. ఎర్రగుడికి చెందిన ఇబ్రహీం కడప జిల్లా దొడియం నుంచి ఆటోలు గంజిగుడ్డలు తీసుకుని ఎర్రగుడికి బయల్దేరాడు. అయితే బనగానపల్లె సమీపంలోని ఇల్లూరు కొత్తపేట సమీపంలో ఆటో డ్రైవర్ ముందువెళ్తున్న ట్రాక్టర్‌ను దాటవేసే క్రమంలో వేగంగా వెళ్తూ అదుపు చేసుకోలేక ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఆటోలో వెనుక కూర్చున్న ఇబ్రహీం అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భార్య కాపురానికి రాలేదని
భర్త ఆత్మహత్య
బనగానపల్లె, మార్చి 7:బనగానపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన రామ్‌లానాయక్ (30) భార్య కాపురానికి రాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ జయన్న సోమవారం తెలిపారు. గర్భిణి అయిన రామ్‌లానాయక్ భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో అవమానంగా భావించిన అతడు ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని బనగానపల్లె వైద్యశాలకు తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.