హైదరాబాద్

ఇళ్లు, పింఛన్లు, రుణాలు, గ్యాస్ కనెక్షన్లు మీకోసంలో విజ్ఞప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మాసాబ్‌ట్యాంక్ ఫస్ట్‌లాన్సార్‌లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసిన హజీమ్ సయ్యద్‌ను తిరిగి అదే స్థానంలో నియమించాలని పలువురు విద్యార్థినులు కలిసి మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో విచ్చేసి హైదరాబాద్ డిఆర్‌ఓ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేసిన హజీమ్ సయ్యద్‌ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారని, తిరిగి ఆయనను తమ పాఠశాల హెచ్‌ఎంగా నియమించాలని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం పాఠశాల విద్యార్థినుల విజ్ఞప్తి మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాధికారికి డిఆర్‌ఓ సూచించారు. ఇళ్లు, ఫించన్లు, రుణాలు, గ్యాస్ కనెక్షన్లు, రైతుబజార్‌ల్లో స్టాల్స్ ఇప్పించాలని తదితర అంశాలకు సంబంధించి నగర ప్రజలు మీకోసం కార్యక్రమంలో విన్నవించారు. ఫలక్‌నుమ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన వికాలాంగుడు కాటపల్లి మహేష్ తనకు పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు కావస్తుందని, అర్థిక ఇబ్బందులు ఉన్నందున తనకు ఫలక్‌నుమ రైతూబజార్‌లో స్టాల్ ఇప్పించాలని ఫిర్యాదులో కోరాడు. స్పందించిన ఆర్‌డిఓ అశోక్‌కుమార్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా మర్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఆదేశించారు.
బస్తీ సభలు పెట్టి ఇళ్ల కోసం
దరఖాస్తులను స్వీకరిస్తాం: కలెక్టర్
హైదరాబాద్ నగరంలో ఇళ్లులేని పేద ప్రజల నుంచి ప్రభుత్వం చేపడుత్ను డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి సంబంధించి బస్తీలవారీగా ‘బస్తీ సభలు’ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తూలను స్వీకరిస్తామని కలెక్టర్ రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ప్రజలు సంయమానం పాటించాలని కలెక్టర్ రాహుల్ సూచించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన పేద ప్రజలందరికీ ఇళ్లను దశలవారీగా కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉందని, అప్పటి వరకు ప్రజలు ఓపిక, సంయమానం పాటించాలని సూచించారు. డబ్బులు వసూలు చేసే దళారుల మాట విని మోసపోవద్దని, ఒక్క నయాపైసా ఎవ్వరికీ చెల్లించవద్దని స్పష్టం చేశారు. దరఖాస్తులు కూడా బస్తీ సభల్లో నిర్వహించి స్వీకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరి పాల్గొన్నారు.