జాతీయ వార్తలు

బలపరీక్షలో హరీష్ రావత్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉత్తరాఖండ్ శాసనసభలో జరిగిన బలపరీక్షలో మాజీ సిం హరీష్ రావత్ గెలిచినట్లు సుప్రీం కోర్టు బుధవారం ప్రకటించింది. బలపరీక్షకు 61 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా, వారిలో 33 మంది హరీష్ రావత్‌కు అనుకూలంగా చేతులెత్తారు. మంగళవారం ఉదయం బలపరీక్ష జరిగినప్పటికీ ఫలితాన్ని సీల్డ్‌కవర్‌లో ఉంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీం కోర్టుకు పంపారు. ఈరోజు ఉదయం సుప్రీం కోర్టులో ఆ సీల్డ్ కవర్‌ను తెరిచి ఫలితాన్ని ప్రకటించారు. బలపరీక్షలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు హరీష్ రావత్‌కు ఉన్నట్లు తేలడంతో ఆయన మరోసారి సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను ఎత్తివేసేందుకు వెంటనే చర్యలు చేపడతామని భారత అటార్నీ జనరల్ సుప్రీంకు తెలిపారు. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీష్ రావత్ ప్రభుత్వంపై వేటు వేసి మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను కేంద్రం విధించింది.