జాతీయ వార్తలు

గృహనిర్బంధంలో హార్దిక్ కుటుంబ సభ్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పర్యటన సందర్భంగా హార్దిక్ పటేల్ కుటుంబ సభ్యులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. హార్దిక్‌స్వగ్రామంలో సిఎం ఆనందిబెన్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హార్దిక్ కుటుంబ సభ్యులందరినీ ఇంట్లోనే నిర్బంధించారు. ఈ చర్యను నిరసించిన ఏడుగురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సిఎం పర్యటన ముగిశాక విడిచి పెట్టారు. పోలీసుల తీరుపై హార్దిక్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.