హైదరాబాద్

అనాథలకు ఆపన్న హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: మహానగరంలోని అనాధలకు అపన్నహస్తం అందించేందుకు ఓ బృహాత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు అనాధలు, వీది బాలల కోసం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు పాలకుల నిర్లక్ష్యం కారణంగా మధ్యలోనే తుస్సుమన్న సందర్భాలనేకం ఉన్నాయి. పాలకులు, ప్రభుత్వాలు మారినపుడు ఇలాంటి కార్యక్రమాలు ముందుకు సాగకుండా మూలనపడుతున్నాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వాలు, పాలకులు మారినా, అనాధలకు ప్రభుత్వమే సంరక్షణగా ఉండేందుకు వీలుగా ఈ సరికొత్త విధానం నియమావళిని నిపుణుల కమిటీ తయారు చేసి, సర్కారుకు సమర్పించినట్లు సమాచారం. అయితే తొలి దశగా ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో అమలు చేయాలని ప్రభుత్వ యోచిస్తుంది. ఇందుకు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలన్న దిశగా సర్కారు ఆలోచన చేస్తోంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత సర్కారు సహాకారంతో కనీసం స్వచ్ఛంధ సంస్థలైనా ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం ఉండాలన్నది సర్కారు ఉద్దేశ్యం. ఇప్పటి వరకు అమ్మా, నాన్నలే గాక, కనీసం నా అన్న వారు లేని వారిని అనధాలుగా పరిగణించిన పాలకులు ఈ సారి మరో అడుగు ముందుకేసి తల్లిదండ్రుల్లో ఒకరుండి, మరొకరు లేని వారిని సైతం గుర్తించి చేయూతనివ్వాలన్న సత్సంకల్పంతో సక్రమంగా అమలయ్యేందుకు వీలుగా ఓ విధానాన్ని రూపకల్పన చేయాలని 50 స్వచ్ఛంధ సంస్థలకు, పలువురు నిపుణులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, నిపుణుల కమిటీతో కలిసి బిహర్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో అనాధలకు అండగా నిలిచేందుకు అక్కడి ప్రభుత్వాలు, స్వచ్ఛంథ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలపై అధ్యయనం చేసి, రాష్ట్రంలో అమలు చేయాల్సిన విధివిధానాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేని వారిని సైతం ఈ స్కీం పరిధిలోకి తీసుకువచ్చి, వారికి ఆశ్రయం కల్పించటం, వారి ఆరోగ్యపరిరక్షణ, విద్యాభ్యాసం, ఉపాధి కల్పన నిమిత్తం శిక్షణతో పాటు బీమా సౌకర్యాన్ని కూడా వర్తింపజేసేలా ఈ విధి విధానాలను రూపకల్పన చేసినట్లు తెలిసింది.
గుర్తించేందుకు ప్రత్యేక అధ్యయనం
అనాధలకు అండగా ఉండేందుకు మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టనున్న సర్కారు వద్ధ ఇప్పటి వరకు రాష్ట్రంలోగానీ, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గానీ అసులు తల్లిదండ్రుల్లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరుండి మరొకరు లేని పిల్లలెంత మంది ఉన్నారో స్పష్టమైన గణాంకాల్లేవు. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక అధ్యయనాన్ని చేపట్టాలనిసర్కారు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.