జాతీయ వార్తలు

ఎపికి ప్రత్యేకహోదా లేదు: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా వస్తుందనుకుంటున్న వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకటించగా, తాజాగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సిన్హా ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. లోక్‌సభలో బుధవారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రస్తావించగా- ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని సిన్హా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో ఈ అంశం లేదని, ఇపుడు కొత్తగా చట్టాన్ని సవరించలేమని ఆయన ప్రకటించారు.