మెదక్

తేనెటీగల దాడిలో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో 24 మందికి గాయాలు
జహీరాబాద్, జహీరాబాద్‌,మార్చి 15: మండలంలోని హోతి(కె)గ్రామంలో తేనెటీగలు(పెద్దవి) దాడిచేయడంతో ఓ రైతు మృతిచెందాడు. మరో 24మంది గాయాలపాలయ్యారు. ఈ దాడిలో మృతిచెందిన వారిలో మండలంలోని జాడీమల్కాపూర్ రామన్న కుమారుడు జగన్న మృతిచెందాడు. అదే గ్రామానకి చెందిన గుండప్ప కుమారుడు శ్రీనివాస్, లింగన్న కుమారుడు గోపాల్ (బొప్నారం)చెందిన వారికి బీదర్ ఆసుపత్రికి పంపించారు. విశాదాంతమైన ఈ సంఘటనకు చెందిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి..గ్రామానికి చెందిన పెద్దబాయి అంజన్న తల్లి పెంటమ్మ మృతిచెందింది. అమె అంత్యక్రియలకు వందలాది మంది హాజరయ్యారు. శవయాత్ర నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా పెద్ద తేనెటీగలు దాడికి తెగబడ్డాయి. దీంతో యాత్రలో పాల్గొన్న వారంతా చెల్లాచెదరయ్యారు. చెట్టుక్కొరు పుట్టకొక్కరుగా పరుగులు తీశారు. కానీ తేనెటీగలు మాత్రం వాదల్లేదు. దీంతో స్థానికంగా ఉన్న చెరుకుతోటను కాల్చి తేనెటీగలను తరమడంలో విజయం సాధించారు. కానీ ఈ పాటికే చాలా మంది వీటి దాడిలో గాయపడ్డారు. దాడి సందర్భంగా జగన్న పరుగులు తీశాడు. అయినా వదలకపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితిని గమనించి ఆయనను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన తుదిస్వాస విడిచాడు. తేనెటీగల దాడిలో మరో 20 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో హోతి(కె)కు చెందిన రాజు, శ్రీనివాస్, జగన్, అంజన్న, మల్లన్న, యదయ్య, నర్సిములు కుమారుడు శ్రీనివాస్, మల్లన్న కుమారుడు నర్సిములు, బక్కప్ప, పండరి, సాయన్న కుమరుడు నర్సిములు, సాయన్న కుమారుడు మల్లన్న, లక్ష్మన్, నాగయ్య, శంకర్, ప్రభు, ఝర్నప్ప కుమారుడు లక్ష్మన్, నాగేష్, రేణుక, పాండు, హన్మన్న, మహిపాల్ తదితరులున్నారు. తేనెటీగలు వెళ్లిపోయిన అనంతరం మృతురాలి అంత్యక్రియలు నిర్వహించారు. తేనెటీగల దాడి సమాచారం తెలసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని పరమార్శించారు.
అంత్యక్రియలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
మండలంలోని హోతి(కె)కు చెందిన పెద్దబాయి అంజన్న తల్లి పెంటమ్మ అంత్యక్రియలకు మండలంలోని జాడిమల్కాపూర్‌కు చెందిన రామన్న కుమారుడు జగన్న మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంలో చోటుచేసుకున్న తేనెటీగల దాడిలో ఆయన తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో ఆయనను చిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో ఒక్కసారిగా విశాదఛాయలు అలుముకున్నాయి. జగన్నకు భార్యతోపాటు ఇద్దరు కుతుర్లు, ఇద్దరు కుమారులున్నారు. రైతు కుంటుంబంలో జన్మించిన ఆయన గ్రామంలో, కుటుంబ సభ్యుల్లో మంచిపేరు సంపాదించకున్నారు. దీంతో ఆయన మరణ వార్తవిన్నంతనే స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు పరమార్షించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు దిక్కులేనివారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసిల్ అధికారులు అవసరమైన సహాకారం అందించనున్నట్లు తెలిపారు.