హైదరాబాద్

వేలాడుతున్న తీగలను వెంటనే తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: మహానగరంలో విద్యుత్ స్తంభాలపై, బహిరంగ ప్రదేశాల్లో వేలాడుతూ ప్రజల పాలిట ప్రాణంతకంగా మారిన కేబుళ్లను వెంటనే తొలగించాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల నగరంలో స్తంభించిన పెనుగాలుల వల్ల భారీ స్థాయిలో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవటం, కూలటం వల్ల వాటికి ఉన్న కేబుల్ వైర్ల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో శుక్రవారం నాడు కేబుల్ కంపెనీల ప్రతినిధులతో మేయర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలపై జిహెచ్‌ఎంసి, విద్యుత్ శాఖల అనుమతి లేకుండా విచ్చలవిడిగా కేబుల్ వైర్లను వేయటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరిచేందుకు అనేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని, ఈ క్రమంలో విచ్చలవిడిగా ఎక్కడబడితే అక్కడ తీగలు వేలాడితే చూసేందుకు బాగుండదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు నగరంలో ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మరో వారం రోజుల్లోగా మరోసారి కేబుల్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, బహిరంగంగా ఉన్న కేబుళ్లను అండర్‌గ్రౌండ్ కేబుల్‌గా మార్చేందుకు నెలరోజుల ఇవ్వటం జరుగుతుందని, ఇచ్చిన గడువులోపు అండర్‌గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను పూర్తి చేసుకోవల్సి ఉంటుందని ఆయన వివరించారు. జిహెచ్‌ఎంసి అనుమతి లేకుండా రోడ్లను అక్రమంగా తవ్వే కంపెనీలపై క్రమినల్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భారీ కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇదే సమయంలో నగర అందాన్ని దెబ్బతిసే ఏ చర్యలను సమర్థించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, అధికారులు పాల్గొన్నారు.