హైదరాబాద్

తెలంగాణ హరితహారంలో విస్తృతంగా మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: జూలై మాసంలో చేపట్టే తెలంగాణ హరితహారం కార్యక్రమం కింద విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. శనివారం సచివాలయం నుండి హరితహారం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌లు, అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధిత శాఖల సమన్వయం తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థల ఆవరణలో, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లకు ఇరువైపులా, చెరువుగట్లు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఎండిఎ పరిధిలోని ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా కళాజాతలతో పాటు కరపత్రాలు, పోస్టర్‌ల ద్వారా ముమ్మర ప్రచారం కల్పించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించామని, ఇందుకు 157 నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారని, ఇప్పటికే 2.14 కోట్ల మొక్కలు వివిధ నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లాలో 50 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు ఇరువైపులా సుందరీకరణ పద్ధతిలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లఢించారు. అదేవిధంగా 10.83 లక్షల ఈత, ఖర్జూర మొక్కలను చెరువు గట్లు, ఇతర ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సామాజిక అడవుల డిఎఫ్‌ఓ నాగభూషణం, డిఎఫ్‌ఓ శ్రీనివాస్, డ్వామా పిడి హరిత, మున్సిపల్ కమీషనర్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ ఆందోళన-గాంధీవాదం పునః స్థాపన పుస్తకావిష్కరణ
ఖైరతాబాద్, జూన్ 4: తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరిస్తూ సీనియర్ పాత్రికేయుడు రామ్‌జీసింహ ఉదయన్ హిందీలో రచించిన ‘తెలంగాణ ఆందోళన - గాంధీవాదం పునఃస్థాపన’ పుస్తకాన్ని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో జెఎసి చైర్మన్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ పాత్రికేయుడు కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగరిక సమాజంలో శాంతియుతంగా ఉద్యమించి ప్రపంచ దృష్టిని చూరగొన్న ఉద్యమం తెలంగాణ పోరాటమని అన్నారు. సబ్బండ వర్ణాలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ఆవశ్యకతను యావత్ ప్రపంచానికి తెలిపారని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర , రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఘట్టాలను వివరిస్తూ రామ్‌జీ సింహ ఉదయన్ అద్భుతంగా రచించారన్నారు. తెలంగాణ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడారు తప్ప వేరొకరి హక్కులను కాలరాసేందుకు కాదని కోదండరామ్ అన్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో మద్దత్తు లభించిందని చెప్పారు. కేవలం రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంతో పాటు సాయుధ పోరాటం, రజాకార్ల పోరాటాలను సైతం పొందుపరచడం అభినందనీయమన్నారు. రచయిత రామ్‌సింహ ఉదయన్ మాట్లాడుతూ ఒక ప్రాంత ప్రజలంతా తమకు రాష్ట్రం కావాలని పోరాటం ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆకాంక్ష మొదటగా వచ్చిందని, తదనంతరం దాన్ని పుస్తకంగా అచ్చువేయించాలని నిర్ణయించుకొని శ్రమించినట్టు చెప్పారు. తాను హిందీలో రచించిన పుస్తకాన్ని గడ్ల పరమేశ్వర్ తెలుగులో అనువదించారని చెప్పారు. కోహినూరు వజ్రం కోసం శ్రమించిన వారికి వజ్రం దక్కనట్టే రాష్ట్రం కోసం శ్రమించిన వారు ప్రస్తుతం ప్రయోజనం పొందలేకపోవడం ఆవేదన కలిగించే అంశమన్నారు.