హైదరాబాద్

పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: ప్రతి ప్రాణి పట్టుక, మరణం ప్రకృతితోనే ముడిపడి ఉంది. ప్రకృతి పచ్చగా ఉంటేనే భూమి మీదున్న ప్రాణులన్నీ చక్కగా మనుగడ సాగిస్తాయి. కానీ రోజురోజుకి పెరిగిపోతున్న గ్లోబర్ వార్మింగ్, పట్టణీకరణ, అడవుల నరికివేత, మానన జీవనశైలిలో ఊహించని మార్పులు చోటుచేసుకోవటం వంటి అనేక కారణాలతో పర్యావరణంలో మానవాళికి ముప్పు కల్గించే పరిస్థితులు తలెత్తాయి. వాటి పర్యవసానంగానే వాతావరణం సమతుల్యత కోల్పోయి అకాల వర్షాలు, సీజన్ లేకుండానే ఎండలు మండిపోవటం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే మున్ముందు భూమి మీద మానవాళి జీవనం కొనసాగించటం కష్టతరంగా మారిన తరుణంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో, పాలకుల్లోనూ అవగాహన తప్పని సరైంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహానగరవాసులకు అతి ముఖ్యమైన, అత్యవసరమైన సేవలందించే మహానగర పాలక సంస్థ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు.
* ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమదైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించుకోవాలి. అంతేగాక, గ్రేటర్‌లో ఇప్పటికే ప్లాస్టిక్‌పై ప్రకటించిన నిషేధం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తాం.
* ప్రతి ఇంట్లో పోగయ్యే చెత్తను ఇప్పటికే తామిచ్చిన రెండు బిన్లలో తడి,పొడిగా వేర్వేరుగా వేయాలి. ఇప్పటి వరకు నగరంలోని 22 గృహాలకు గాను 44 డస్ట్‌బిన్లను పంపిణీ చేశాం.
* ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలి. ఇంట్లో ఆరుబయట ఏ మాత్రం స్థలం ఉన్నా మొక్కలు నాటితే వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.
* వరద నీటి కాలువలు, నాలాల్లో చెత్త చెదారం, అలాగే ప్లాస్టిక్ పడకుండా చూసుకోవాలి
* పర్యావరణ పరిరక్షణలో నీటిని పొదుపుగా వాడటం, ఉన్న నీటి వనరులను పరిరక్షించుకోవటం ఎంతో ముఖ్యం
* బహిరంగ మలమూత్ర విసర్జనలను మానుకునేలా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి. ఇందుకు ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధిలో ఇంట్లో మరుగుదొడ్లు లేని కుటుంబానికి రూ. 12వేలు చెల్లిస్తుంది.
* పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజలను భాగస్వాములను చేస్తూ, కృషి చేస్తున్న సంస్థలు, స్వచ్చంద సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించాలి
* ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, ఇంటి ఆరుబయట వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునే దిశగా అవగాహన వంతులను చేయాలి.
* కాలనీ సంక్షేమ సంఘాలు, పారిశుద్ధ్య కార్మికులు తరుచూ పార్కుల్లో, రీక్రియేషన్ ప్రాంతాలు, స్కూళ్లు, కార్యాలయాలను తరుచూ శుభ్రపర్చుకునటాన్ని అలవాటు చేసుకోవాలి.