హైదరాబాద్

ముంచుకొస్తున్న వర్షం ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: ఎవరో వస్తారని..ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..! అంటూ రాసిన ఓ సినీగేయాన్ని ఒక్కసారి జంటనగరవాసులు గుర్తుకు తెచ్చుకుని, ఆ దశగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సారి సాధారణం కన్నా అత్యధిక మోతాదులో వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటి పలు సార్లు హెచ్చరికలు జారీ చేసినా, మహానగర పాలక సంస్థ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఎండల ప్రభావం తగ్గి వాతావరణం చల్లబడిన గడిచిన నెలరోజుల్లో మూడు సార్లు ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే! ముగ్గురు పౌరులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన గుణపాఠం నేర్చుకోని అధికారులు నేటికీ కనీసం అత్యవసర బృందాలను సైతం సిద్ధం చేయలేదు. ఈ సారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించే అవకాశముండటంతో పాటు రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించినా, అధికారులు నేటికీ కనీసం జోన్లు, సర్కిళ్ల వారీగా అత్యవసర బృందాలను తయారు చేయలేకపోయారు. పైగా మున్సిపల్ మంత్రి కెటిఆర్ అమెరికా పర్యటనకు వేళ్లే ముందు నిర్వహించిన సమీక్షలో రెండు రోజుల్లో ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేస్తామంటూ మంత్రికి వివరించిన జిహెచ్‌ఎంసి అధికారులు నేటికీ బృందాలను ఏర్పాటు చేయలేదు. ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు వానాకాలం కష్టాలను తగ్గించేందుకు రౌడ్ ది క్లాక్ తాము అందుబాటులో ఉంటామని చెప్పుకొస్తున్న బల్దియా అధికారులు కనీసం భారీ వర్షం పడినపుడు, ఏదైనాకాలవైపరీత్యం సంభవించినపుడు యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టే యంత్రాలు గానీ, పని నైపుణ్యత గానీ లేని సిబ్బందిని నియమించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శ వెల్లువెత్తుతోంది. పైగా గడిచిన నెలరోజుల్లో మూడుసార్లు వర్షం సృష్టించిన బీభత్సానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులు డయల్ 100కు అనుసంధానం చేస్తూ 21111111 ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇదీ అలంకారప్రాయంగానే తయారైంది. వాతావరణ శాఖ నుంచి వర్షాలకు సంబంధించిన ముందస్తు సమాచారంతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కంట్రోల్ రూం నుంచి ఎమర్జెన్సీ బృందాలను పంపి, సహాయక చర్యలను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ ప్రారంభించిన కొత్తలో మాత్రమే పనిచేసిన ఈ కంట్రోల్ రూం నెంబర్ ఆ తర్వాత మొరాయించింది. ఇప్పటికీ ఫోన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నా, క్షేత్ర స్థాయిలో అవి పరిష్కారం కాకపోవటం విపత్తుల నివారణకు జిహెచ్‌ఎంసి చేస్తున్న కృషికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
పేరుకే విపత్తుల నివారణ సెల్
మహానగర పాలక సంస్థలో విపత్తుల నివారణ సెల్ అంటూ ప్రత్యేకంగా ఓ వింగ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఇది కేవలం నామమాత్రంగానే తయారైంది.
భారీ వర్షాలు కురిసినపుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించటంతో పాటు సంబంధిత విభాగాల అధికారులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించాల్సి ఉంది.
కానీ గ్రేటర్‌లోని విపత్తుల నివారణ సెల్ అనేది కేవలం ఓ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, ఓ అటెండర్, ఫోన్‌కే పరిమితం కావటం గమనార్హం.