హైదరాబాద్

తెలుగు సంస్కృతికి కేంద్ర బిందువు త్యాగరాయ గానసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి కేంద్ర బిందువుగా శ్రీత్యాగరాయ గానసభ నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ స్వర్ణోత్సవ వేడుకలు మూడోరోజు సోమవారం గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కళాలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న కళారంగన్నికి ఎంతో సేవ చేస్తున్నారని పేర్కోన్నారు. ప్రభుత్వం సంస్కృతిక రంగలను ప్రోత్సహించాలని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలుకలూరి ఇనాక్ మాట్లాడుతూ శ్రీత్యాగరాయ గానసభ సాహిత్యన్నికి వెలుగునిస్తుందని తెలిపారు. కళారంగన్నికి దీక్షితులు చేస్తున్న సేవ ఎంతో అభినందనీయమని చెప్పారు. కొలుకలూరి ఇనాక్ మూర్తిదేవి పురస్కారం అందుకున్న సందర్భంగా ఇనాక్‌ను ఘనంగా సత్కారించారు. ఆచార్య టి.గౌరిశంకర్, డా.చిల్లర భవనీదేవి, డా.వై.రామకృష్ణరావు, ఆచార్య ఎస్.శరత్‌జ్యోత్స్న, డా.వడ్డేపల్లి కృష్ణ, టి.తమిరిష జానకి, వినంపూడి శ్రీలక్ష్మీ, ఎన్‌వి.రఘువీరప్రతాప్, శైలజమిత్ర సాహిత్య కవిసమ్మేళనం నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఏల్లూరి శివారెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖులు డా.తెనే్నటి సుధాదేవి, మద్దాళి రఘురామ్, నాగరాజు, గానసభ అధ్యక్షుడు కళావేంకట దీక్షితులు, ప్రధాన కార్యదర్శి కళాశారద, కళాజనార్దన్ మూర్తి పాల్గొన్నారు.

బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

హైదరాబాద్, జూన్ 6: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రత్యేక అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక అధికారులు చొరవ చూపాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నమోదు శాతాన్ని పెంచేందుకే జయశంకర్ బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్థేశ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు స్వచ్చంద సంస్థల సహకారంతో పిల్లలందరు బడిలో చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 13న జరిగే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో జరిగేలా సంబధిత ఎంఇఓలకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పలకలు, పెన్సిళ్లు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని సూచించారు. తక్కువ నమోదు శాతం ఉన్న పాఠశాలలను గుర్తించి నమోదు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సూచనల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ ‘బడిబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి జె.శ్రీనివాస్ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అసలే నమోదు కాని పాఠశాలలు, నమోదు సంఖ్య తక్కువగా గల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా పాఠశాలల పునప్రారంభానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది నమోదైన విద్యార్థులకు అదనంగా కనీసం 10శాతం నమోదు పెంపునకు కృషి చేయుటకు మండల విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, సీఆర్పీలు, కెజిబివి ప్రత్యేక అధికారులు కృషిచేయాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఇప్పటికే గుర్తించిన 2250 బడి బయట పిల్లలను బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నమోదు చేసి వారికి నిలకడగా విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎనిమిదో తేదీన విద్యార్థుల నమోదు పెంపుటకై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల ప్రముఖలచే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బడిబాట ర్యాలీ, 9న పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీకి గ్రామ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం, ఐదు నుంచి ఏడోతరగతి తరగతి పూర్తిచేసిన విద్యార్థులను పైచదువులకు పంపించాలని అన్నారు. 10వ తేదీన స్వచ్ఛ పాఠశాలల కార్యక్రమం, పరశుభ్రత, 13న ఒకటోతరగతి విద్యార్థులకు సామాజిక అక్షరాభ్యాసం, 14న మండల స్థాయి నమోదు కన్సాలిడేషన్‌పై సమీక్షా, 15, 16వ తేదీలలో గ్రామ విద్యా రిజిష్టర్లను సమగ్రంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిత్యం ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యాన్ని పాఠశాలలో కల్పించే సౌకర్యాలను వివరిస్తూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుటకు విస్తత్ర ప్రచారాన్ని నిర్వహించి ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో లక్ష్యాలను సాధించాలన్నారు.
మ్కొలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. వికారాబాద్, తాండూరు, చేవెల్ల, మర్పల్లి మండలాలకు సంభందించి ల్యాండ్ పర్‌చేసే స్కీంకు సంబంధించిన వివరాలను తహశీల్దార్ల నుంచి తెప్పించుకుని రిజిస్టర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండేవిదంగా ఎరువులు, విత్తనాల స్టాకులను సిద్ధంగా ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మండాలలో స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతిఓజా, డిఆర్‌డిఏ పిడి సర్వేశ్వర్‌రెడ్డి, సిపిఓ శర్మ, డ్యామా పిడి హరిత, వ్యవశాయ శాఖ జెడి జగదీష్, సర్వశిక్ష అభియాన్ పిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.