హైదరాబాద్

ప్రభుత్వ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ భారతి హోళీకేరి సూచించారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో విభిన్న ప్రతిభ గల వికలాంగులకు లాప్‌టాప్‌లను, వినికిడి యంత్రాలను, మూడు చక్రాల మోటారు వాహానాలను వికలాంగుల సంక్షేమం శాఖ ద్వారా లబ్దిదారులకు అమె అందజేశారు. నాంపల్లిలోని సెవెన్త్ డే అడ్వంటిస్ట్ స్కూలు యాజమాన్యం ప్రతి సంవత్సరం రీ-అడ్మిన్ పేరిట రూ.3వేల నుంచి రూ.5వేలు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని కాలపత్తర్‌కు చెందిన సైఫుల్లా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పరంగా పొందుతున్న వివిధ పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదు దారులు తప్పకుండా తాము జీవించ ఉన్నట్లు లైఫ్ వెరిఫికేషన్‌ను మీ-సేవా ద్వారా ఆన్‌లైన్‌లో చేయించుకోవాలని తెలిపారు. మీ-సేవల ద్వారా ఈప్రక్రియను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొవాలని తహశీల్దార్లను ఎజెసి ఆదేశించారు. వివిధ రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు మీ-సేవా కేంద్రాల్లో రూ.20 చెల్లించి లైఫ్ వేరిఫికేషన్‌ను పూర్తి చేసుకుంటనే పెన్షన్ అందిస్తామని తెలిపారు. విద్యార్థులు ఎం.విద్య, జి,రేణుక, జితేష్, జైన్, వి.సంతోష్‌కు ల్యాప్‌టాప్‌లు, నిజాముద్దీన్, జె.గణేష్‌కు వినికిడి మిషన్లు, కె.నర్సింహులు, జి.నవీన్‌కుమార్‌కు మూడు చక్రాల మోటారు వాహనాలను జెసి అందజేశారు.