హైదరాబాద్

దశలవారీగా ఎస్సీ వర్గీకరణకు ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 6: ఎస్సీ వర్గీకరణ సాధించేందుకు దశలవారీగా ఉద్యమిస్తామని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ జెఏసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎ, బి, సి, డి వర్గీకరణ అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఏళ్ల తరబడి నానుతున్న ఈ సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించి, మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అవశ్యకతను తెలిపేందుకు జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. వర్గీకరణ జరగక పోవడంతో మాదిగ జాతికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. జూన్, జూలై నెలల్లో సదస్సు, సమ్మేళనాలు నిర్వహిస్తామని, వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ అంశాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు నెలలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ నెలలో మాదిగల మహాసమ్మేళనం, అక్టోబర్ నెలలో మాదిగల అలాయ్- బలాయ్ కార్యక్రమం చేపడతామని వివరించారు. మాదిగల న్యాయమైన డిమాండ్ వర్గీకరణకు కేంద్రం సహకరించకపోతే చివరగా పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా బిజెపి గద్దెలను తొలగించడం, ఆ పార్టీకి ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వీరబాబు, మాదిగ జెఎసి హైదరాబాద్ అధ్యక్షుడు సరేష్, అంజిబాబు, ఎల్లన్న పాల్గొన్నారు.