హైదరాబాద్
కోదండరామ్‌పై టిఆర్ఎస్ వ్యాఖ్యలకు నిరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూన్ 7: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టిజేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై టిఆర్ఎస్ మంత్రులు, ఎంపిలు, నాయకులు చేసిన అనుచిత విమర్శలకు నిరసనగా మంగళవారం మల్కాజిగిరి టిజేఏసి ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ టిజేఏసి కో-ఆర్టినేటర్ రామగిరి ప్రకాష్, మల్కాజిగిరి టిజేఏసి కో-చైర్మన్ నహీమ్ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్న ఉద్యమ నాయకులపై టిఆర్ఎస్ దళారీ నాయకత్వం దండయాత్రకు దిగితే ఉద్యమ చైతన్యం ఉన్న తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలిపారు. ఈరోజు తెలంగాణ ఉద్యమద్రోహులంతా టిఆర్ఎస్లో చేరి ఉద్యమకారులపై తమ ఉద్యమకార్యాచరణ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిజెఎసి నాయకులపై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కోదండరామ్ కార్యాచరణను పొగిడిన నేటి మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు నేడు ఆయనపై చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇకపై టిజెఎసి చైర్మన్ కోదండరాంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.శ్రీనివాస్, ప్రియతం రామకృష్ణ, సునీల్‌యాదవ్, ఉండాడి లాలయ్య, నర్సింహాచారి, రవి, బాబురావు, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.