హైదరాబాద్

తెలంగాణ ద్రోహులు.. మీరా కోదండరామ్‌ను విమర్శించేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్ 7: తెరాస పార్టీ పూర్తిగా తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిపోయిందని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జెఎసి చైర్మెన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్.కోదండరామ్‌ను క్యాబినెట్ మంత్రులు విమర్శించడాన్ని నిరసిస్తూ ఓయులో ఐదుగురు మంత్రుల దిష్టిబొమ్మలను ఊరేగించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ నిస్వార్థంగా ఉద్యమాన్ని కొనసాగించి ఎలాంటి పదవులు ఆశించని తెలంగాణ గాంధీ కోదండరామ్‌ను తెలంగాణ ద్రోహులు విమర్శిస్తారా? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్ దీక్షలతోకాదు విద్యార్థుల త్యాగాలతో, కోదండరామ్ రాష్ట్రంలోని అన్నివర్గాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి నడిపిన ఉద్యమ ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని అన్నారు. ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఉద్యమద్రోహులను నేడు పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు అప్పగించిన కేసిఆర్ ఉద్యమకారులను ఘోరంగా అవమాన పర్చారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసిఆర్ సర్కార్ నెరవేర్చకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్‌కు తెలంగాణ ఉద్యమం మీద, ఉద్యమకారులమీద సానుభూతి ఉంటే తెలంగాణ గాంధీ కోదండరామ్‌ను విమర్శించిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులం వారికి తగిన విధంగా బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తిరుగులేని ఉద్యమానికి సారథ్యం వహించి పదవులను సైతం తృణప్రాయంగా పక్కన పెట్టిన కోదండరామ్ నిజాలను మాట్లాడితే తట్టుకునే ధైర్యం లేని కేసిఆర్ ఉద్యమద్రోహులను ఉసికొల్పుతారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, వ్యక్తిగత స్వేచ్ఛా వాతావరణం లేదని, అభిప్రాయాలను సైతం వెల్లడించలేని పరిస్థితిని కెసిఆర్ తీసుకువచ్చారని అన్నారు. దొరలపాలన నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడకపోతే బ్రహ్మరధం పట్టిన ప్రజలే చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కోదండరామ్‌కు కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని, ఉద్యమద్రోహులను బర్తరఫ్ చేసి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొ.కోదండరామ్‌ను విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకుంటామన్నారు. కోదండరామ్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలంగాణ ద్రోహులతో హాని ఉందని ఈ విషయాన్ని రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకుపోనున్నామని కల్యాణ్ వివరించారు.
బుధవారం జెఎసి చైర్మెన్ కోదండరామ్ నివాసానికి పెద్దయెత్తున ఓయు విద్యార్థులం తరలివెళ్లి సంఘీభావం ప్రకటించడంతోపాటు ఆయన వెన్నంటి ఉంటామని తెలుపనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి వేదిక ఓయు జెఎసి అధ్యక్షుడు సాంబశివ గౌడ్, బాబూలాల్ నాయక్, మదన్, రవీంద్రనాయక్, క్రాంతి, జగన్, లింగస్వామి, సురేశ్, నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.