హైదరాబాద్

పాలనా యంత్రాంగం వైఫల్యంతో దిగజారిన విద్యాప్రమాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: పాలనా యంత్రాంగం వైఫల్యంలో విద్యాప్రమాణాలు దిగజారాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పబ్లిక్ పాఠశాలలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు గురుపూజా కార్యక్రమం మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. రామయ్య మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించడంతో విద్య వ్యాపారంగా మారిందని అన్నారు. గతంలో ఉపాధ్యాయుడిని దైవంతో సమానమైన గౌరవం ఉండేదని చెప్పారు. ఉపాధ్యాయుల ఎంపికను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇవ్వడం మంచిదేనని తెలిపారు. విద్యావ్యాపారంలో విద్యార్థి కస్టమర్‌గా మారాడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు దిక్సూచి వంటి వారని అన్నారు. విద్యార్థులకు పరీక్షల్లో మార్కులతోపాటు సంస్కారం ముఖ్యమని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకుడు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణలో నాలుగువేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని అన్నారు.
సమర్థవంతమైన పాలకులు, విద్యాధికారులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు దెబ్బ తింటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో 12 మంది ఉపాధ్యాయులకు విశిష్ట ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హాజరై మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి బహుమతులను అందించారు. కార్యక్రమంలో సందీప్‌కుమార్ పాల్గొన్నారు.