హైదరాబాద్

ఉద్యమంతో సంబంధంలేని మంత్రులు కోదండరామ్‌ను విమర్శించడమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్ 7: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినంత మాత్రాన తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మెన్ ప్రొ.కోదండరామ్‌పై మంత్రులు మూకుమ్మడి దాడి చేయడం అమానుషకరమని టిడిపి నగర సెక్రటరీ జనరల్ ఎంఎన్.శ్రీనివాస్, మేకల సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం నగర టిడిపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనకోసం అలుపెరుగని ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర సాధనలో కీలకంగా పాత్ర పోషించిన కోదండరామ్‌పై కేసిఆర్ మెప్పుకోసం తెరాస మంత్రులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ,ప్రొ.జయశంకర్, కాళోజీవంటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వారిని విస్మరించి తెరాస పాలన కొనసాగిస్తుందని అన్నారు. అసలు ఉద్యమసమయంలో ఎటువంటి పాత్ర పోషించని వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి, ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారిని అవమానించారని అన్నారు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు స్థానం కల్పించకుండా మహిళా లోకాన్ని కించపర్చారన్నారు. దళిత డిప్యూటీ సిఎంను అర్థాంతరంగా తొలగించినా ప్రశ్నించని మంత్రులు, ఒక్కసారిగా ఉలిక్కిపడి కోదండరామ్‌పై విమర్శల దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వంపై ఎప్పుడు ఎటువంటి విమర్శలు వచ్చినా ముందుండే కేసిఆర్ కుటుంబ సభ్యులు వౌనంగా ఉన్నారంటే కోదండరామ్ వ్యాఖ్యాలను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. లేక కోదండరామ్‌ను విమర్శించే దమ్ము కెసిఆర్ కుటుంబ సభ్యులకు లేదా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం టిఆర్‌ఎస్ తమ పేటెంట్‌గా వ్యవహరిస్తుందని, మంత్రులు తమ వైఖరి మార్చుకోవాలని దేశం నేతలు హితవుపలికారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని, ప్రొ.కోదండరామ్‌కు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.