హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగుల బీమా మరో ఆరు నెలల పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7:ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను మరింత బలోపేతం చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హెల్త్ రీయింబర్స్‌మెంట్ పథకం బాగుందని, దీనిలోని మంచి అంచశాలను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను అమలు చేయనున్నట్టు చెప్పారు. దీని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రస్తుతం అమలులో ఉన్న ఉద్యోగుల బీమా పథకాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై సచివాలయంలో మంత్రి సమీక్ష జరిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటి వరకు మంజూరు అయిన నిధులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, మిగిలిన నిధుల వంటి అంశాలను సమీక్షించారు. ఎంప్లాయిస్ హెల్త్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్ ద్వారా 1885 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. సకాలంలో వైద్యం అందుతున్నట్టు చెప్పారు.
స్పెషల్ నర్సింగ్ కోర్సులు
రాష్ట్రంలో నర్సింగ్ విద్యను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యా సంస్థలు ఒకే రకమైన నర్సింగ్ విద్య అమలు చేస్తున్నారని, మారిన కాలానికి అనుగుణంగా నర్సింగ్ విద్యలోనూ మార్పులు అవసరం అని చెప్పారు. నర్సింగ్ విద్యలోనూ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభించాలని చెప్పారు.
ఐసియు, కార్డియాలజీ, థియోటర్, నెఫ్రాలజీ వంటి అనేక విభాగాల వారిగా శిక్షణ ఉంటే బాగుంటుందని అన్నారు. నర్సింగ్ కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి, ప్రైవేట్ నర్సింగ్ యాజమాన్యాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.