హైదరాబాద్

పోడు సాగుదారులకు పట్టాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 7: రాష్ట్రంలో గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల వారికి పోడు సాగుదారుల భూములకు పట్టాలు ఇవ్వాలని రిటైర్డు ఐ ఎ ఎస్ ఎ.గోపాల్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన గోపాల్ రావు మాడ్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 సంవత్సరాలు గడిచినా, పేద ప్రజలకు ఆర్ధికంగా స్వాతంత్రం రాలేదన్నారు.
అత్యంత ప్రధానమైన భూమి సమస్య నేటికి పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు పేదలకు భూములు ఇవ్వకపోగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం దుర్మార్గం అన్నారు. గతంలో చేసిన పోరాటాల ద్వారా వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి హరితహరం పేరుతో పేదలను భూముల నుండి బేదఖల్ చేసే విధానం సహించరాదన్నారు. భూమి కోసం, భుక్తికోసం వామపక్ష ప్రజాసంఘాలు గతంలో అనేక పోరాటాలు నిర్వహించాయని, మళ్ళీ అలాంటి పోరాటాలు ఉద్దతం చేసి, మన హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ నాయకులు చాడా వెంకట్‌రెడ్డి, గుండా మల్లెష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని భూ సమస్యలపై ముఖ్యమంత్రికి అనేక సార్లు విన్నవించామని తెలిపారు. నిరుపేదలైన పాడు సాగుదార్లపై రెక్కాడితే డొక్కాడని పేదలపై హరితహారం పేరుతో దాడులు చేస్తూ, పిడియాక్టు పెట్టి జేళ్లలో పెడుతున్న సిఎం కెసిఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. సిఎం కెసిఆర్‌కు మాటలెక్కువ పని తక్కువ అని విమర్శించారు. పోడు భూముల పట్టాల సాధనకై ఈ నెల 20న డిఎఫ్‌వో కార్యాలయాలను ముట్టడించాలని సదస్సు పిలుపునిస్తూ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు సిద్ధి వెంకటేశ్వర్లు, వీర హనుమంతరావు, కె. కాంతయ్య పాల్గొన్నారు.