హైదరాబాద్

సకాలంలో విత్తనాలు, ఎరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ఖరీఫ్ పంట కోసం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతామమహేందర్‌రెడ్డి వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్‌లో స్థాయిసంఘం-3 వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈసంవత్సరం వర్షపాతం ఎక్కువ ఉన్నందున రైతులు పంటలు పండించుకోవడానికి సబ్సిడీ ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మండలంలో వ్యవసాయ అధికారుల ద్వారా అందజేయాలని చెప్పారు. రైతులకు ట్రాక్టర్లు, పనిముట్లు అందజేసేటప్పుడు కమిటీలో ప్రజాప్రతినిధులకు తెలియజేసి అర్హులైన వారికి అందేల చూడాలని అన్నారు. పత్తి పంటలకు భీమా జూన్ 14 వతేదితో ముగుస్తున్నందున గ్రామాలలో దండోరా వేయించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రానప్పుడు రైతు బందు పథకం గురించి రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతల్లో ప్రతి రైతు కుటుంబ పశువులు గేదేలు, మేకలు, గొర్రెలు, కోళ్లను పెంచి ఆర్థికంగా ఎదిగేలా వారికి అవగాహణ కల్పించాలని తెలిపారు. ఉద్యాన పంటలు వేసేల వారికి శిక్షణ ఇవ్వాలని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూరగాయాలు, పూలతోటల సాగుపై వారికి అవగాహన కల్పించాలన్నారు.