హైదరాబాద్

చేపల కోసం పోటాపోటీ - ఆకాశాన్ని అంటిన ధరలతో లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూన్ 8: మృగశిరకార్తె రాకతో స్థానికంగా చేపల విక్రయాలు జోరందుకున్నాయి. వేసవికాలం ముగుస్తుందనగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా రోగాల బారిన పడకుండా చేపలను భుజించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం మృగశిర కార్తెతో నియోజకవర్గ కేంద్రంలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణంగా కిలో రూ. 100 నుండి 120 వరకు పలికే చేపల ధరలు మృగశిర కార్తె రాకతో రెట్టింపు ధరలకు విక్రయాలు జరిపారు.
బొచ్చె, రవ్వ, చందమామ, కొర్రమీను వంటి చేపలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని విక్రయాలు జరిపారు. గతంలో పెద్ద చెరువులో నీరు ఉండగా అక్కడే చేపలను పట్టి విక్రయాలు జరిపేవారు. మృగశిర కార్తె రోజున తప్పకుండా చేపలు తినాలన్న ఆనవాయితీ ఉండటంతో ప్రజలు ధరలను భేఖాతరు చేస్తూ చేపలను కొనుగోలు చేశారు. దీంతో స్థానికంగా చేపల మార్కెట్ పూర్తి రద్దీగా కనిపించింది.
రూ.200 నుంచి రూ.800 వరకు ధర పలికిన చేపలు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లో మృగశిర కార్తె పర్వదినాన్ని రాజేంద్రనగర్‌వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ప్రజలు చేపలు తినడం ఆనవాయితీ. దీంతో రాజేంద్రనగర్‌లో చేపలు కొనేందుకు ప్రజలు బారులు తీరారు. చేపల విక్రయాల కేంద్రాల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు చేపలు కొనేందుకు బారులుతీరారు.
మృగశిర కార్తె అంటే ఎండాకాలానికి స్వస్తి చెబుతూ వర్షాకాలంలో అడుగిడుతున్న తరుణంలో వచ్చే కార్తె అని, ఈ పర్వదినాన చేపలు తప్పకుండా తినాలనే ఆనవాయితీ అనాదిగా వస్తోంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, శివరాంపల్లి, మధుబన్‌కాలనీ, లక్ష్మిగూడ తదితర బస్తీల్లో ఏర్పాటు చేసిన చేపల మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోయింది.
ఆకాశాన్నంటిన చేపల ధరలు
మృగశిర కార్తె పర్వదినంరోజు చేపలు తినే ఆనవాయితీ ఉండటంతో ఇదే అదునుగా భావించిన చేపల వ్యాపారులు ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా చేపల ధరలు పెంచి విక్రయాలు కొనసాగించారు. దీంతో వినియోగదారులు చేపల ధరలు విని కళ్లు తేలేశారు. మార్కెట్‌లో చేపలు కొర్రమట్టలకు రూ.500 నుంచి రూ.800 వరకు ధరలు పలుకగా, సాధారణ చేపలు రూ.150 నుంచి 500 వరకు పలికాయి. గత్యంతరం లేక ఎంత ధర చెబితే అంత ధర పెట్టి కొనుగోలు చేశారు.
నగర శివారు చెరువుల వద్ద బారులు ...
నగర శివారు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఉదయం 5 గంటల నుంచి చెరువుల వద్ద చేపలకోసం పోటీలు పడి కొనుగోలు చేశారు. టోకెన్ల ద్వారా చేపల విక్రయాలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం నుంచే చెరువుల వద్ద ప్రజలు బారులు తీరి చేపలు కొనుగోలు చేశారు. చేపలమ్మే నిర్వాహకులకు, ప్రజలకు మధ్య స్వల్ప గొడవలు సైతం జరిగాయి. జల్‌పల్లి చెరువులో ఇష్టానుసారంగా చేపల ధరలు నిర్ణయించి అమ్మడంతో వినియోగదారులకు, వ్యాపారస్తులకు తోపులాట జరిగింది.
మేడ్చల్‌లో కొర్రమీను రూ. 1000 పైమాటే
మేడ్చల్: మృగశీర కార్తె సందర్భంగా తప్పనిసరిగా చేపలను తినాలని ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడి చేపలను కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించే మృత్స్య వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచేశారు. బుధవారం మేడ్చల్ చేపల మార్కెట్‌లో మృగశిర కార్తె సందర్భంగా చేపల ప్రియులకు ఆకాశన్నంటిన చేపల ధరలు చుక్కలు చూపించాయి. చేపలను తినని వారు సైతం మృగశిర సందర్భంగా చేపల కొనుగోలు కోసం చేపల ప్రియులు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలిరావడంతో మార్కెట్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. కొర్రమీను చేప ధర ఏకంగా రూ. 1000కి పైగా పలికింది. అది కూడా అంతగా అందుబాటులో లేకపోవడంతో కొర్రమీను చేపల ప్రియులు మార్కెట్‌లో లభించిన చేపలతో అడ్జస్ట్ కాక తప్పలేదు.
అయితే సాధారణ ధరకు నిత్యం లభించే చేపల ధరలను సైతం చేపల వ్యాపారులు రెట్టింపు చేసి విక్రయించారు. అయిన కొనుగొలుదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఖరీదు చేయక తప్పలేదు. మామూలు రోజుల్లో రూ. 400 ధర పలికే కొర్రమీను చేపలు వెయ్యి రుపాయల ధర పలుకగా మిగతా రవ్వ, బొచ్చ తదితర రకాల చేపలు రూ. 200 నుండి 300 వందల వరకు ధర పలికాయి. చేపల మార్కెట్ కొనుగోలుదార్లతో సందడిగా మారింది.