రంగారెడ్డి

క్యారమ్ చాంప్స్ అనిల్‌కుమార్, సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, జూన్ 8: ఎన్‌టిపిసి 46వ సీనియర్ అంతర్ జిల్లా క్యారమ్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ ఎజిఓఆర్‌సికి చెందిన వి.అనిల్‌కుమార్, డిఎల్‌ఆర్‌ఎల్‌కు చెందిన బి.సునీత గెల్చుకున్నారు. రామగుండంలోని జ్యోతిక రిక్రియేషన్ క్లబ్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్ పురుషుల విభాగం సింగిల్స్ ఫైనల్లో అనిల్‌కుమార్ 25-0, 25-0 స్కోరు తేడాతో ప్రత్యర్థి హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌జాహీర్‌పై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సయ్యద్ జాహిర్ 20-6, 24-14 స్కోరు తేడాతో హైదరాబాద్‌కు చెందిన పిపి సూరేష్‌కుమార్‌పై, వి.అనిల్‌కుమార్ 23-7, 25-16తో హైదరాబాద్‌కే చెందిన వి.శివనాందరెడ్డిపై గెలుపొందారు.
మహిళల విభాగంలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో డి.సునిత 25-19, 25-11 స్కోరు తేడాతో ప్రత్యర్థి హైదరాబాద్‌కు చెందిన మాధవిపై విజయం సాధించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సునీత 25-4, 18-11తో ఆదిలాబాద్‌కు చెందిన ఎన్.స్వాతిపై, జి.మాధవి 10-23, 25-7, 25-7తో అశ్వీనిపై నెగ్గింది.
వెటరన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జిహెచ్‌ఎంసికి చెందిన మార్టిన్‌మెనేజస్‌పై 25-14, 25-7 స్కోరు తేడాతో హైదరాబాద్‌కే చెందిన ఎ.శ్రీనివాస్ రావు గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో శ్రీనివాస్‌రావు 25-4, 25-4 స్కోరు తేడాతో ప్రత్యర్థి కరీంనగర్‌కు చెందిన కె.నర్సయ్యపై, మార్టిన్‌మెనేజస్ 19-17, 25-15తో హైదరాబాద్‌కు చెందిన డిపి రాజుపై నెగ్గారు.

ఉప్పల్ జంక్షన్, ప్రధాన రహదారి అభివృద్ధిపై సమీక్ష
ఉప్పల్, జూన్ 8: ఉప్పల్ రింగ్‌రోడ్డు, ప్రధాన రహదారి, ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి పనుల ప్రతిపాదనలు చకచక జరుగుతున్నాయి. రూ.658 కోట్ల వ్యయంతో చేపట్టే ఇట్టి అభివృద్ధి పనుల ప్రణాళికలను సిద్ధం చేసి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు. బుధవారం జాతీయ రహదారుల సిఇ గణపతిరెడ్డి, జిహెచ్‌ఎంసి సిసిపి దేవేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అభివృద్ధి పనుల సర్వే ఇతర వివరాలతో కూడిన ప్రణాళికల నివేదిక పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర అనుమతి వస్తే సకాలంలో పనులు చేపట్టడానికి అధికారులు పూర్తి సహాయ సహకారం అందించాలని పేర్కొన్నారు. పెరుగుతున్న వాహనాలతో ఇరుకైన ఉప్పల్ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా సమస్యతో ప్రజలు, వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించాలంటే జంక్షన్ అభివృద్ధి, రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 6.7కిలో మీటర్ల వరకు సర్వే ఆఫ్ ఇండియా, రామంతాపూర్ రహదారిలోని కేంద్రీయ విద్యాలయం నుంచి మేడిపల్లి సిపిఆర్‌ఐ వరకు ఎలివేటెడ్ కారిడార్, ఆరులైన్ల రహదారి విస్తరణ పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇట్టి పనులు పూర్తయితే ఉప్పల్ పట్టణ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.
తాగునీటి సమస్య పరిష్కరిస్తా
ఉప్పల్ నల్లచెరువు సమీపంలోని స్వరూప్‌రెడ్డినగర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ప్రభాకర్ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ సభ్యులు ఇ.ఈశ్వరయ్యముదిరాజ్, పి.చంద్రయ్య, జ్ఞానేశ్వర్, కె.సుభాష్, ఎస్.రాజు, పి.శ్రీనివాసచారి, జి.కుమార్, ఇ.శ్రీనివాస్, జి.శంకర్‌గౌడ్, పంగ యాదిరెడ్డి ఎమ్మెల్యేను కలిసి కాలనీలో నీటి సమస్యపై ఏకరువుపెట్టుకున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పైపులైను వేసి నీటి సమస్యను పరిష్కరించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రానున్న నెల రోజుల్లో పైపులైను పనులు చేయించి నీటి సమస్యను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఇతర రహదారులు, భూగర్భ డ్రైనేజి వంటి సమస్యలను సైతం పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి
సైదాబాద్, జూన్ 8: సింగరేణి కాలనీలో ఆటోడ్రైవర్ అనుమాన స్పద స్థితిలో మృతిచెందాడు. అతనితో కలిసి మద్యం సేవించిన కానిస్టేబులే హతమార్చాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన సిరినాయక్(45) సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ ఆటోనడుపుతూ జీవిస్తున్నాడు. బుధవారం తెల్లవారు ఝామున అతని ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో పార్కు చేసి ఉన్న ఆటోలో ముందు సీటులో సిరినాయక్ విగత జీవిగా పడి ఉన్నాడు. వెనకసీటులో మరో వ్యక్తి మద్యం మత్తులో పడుకొని ఉన్నాడు. అతనే సిరినాయక్‌ను చంపి ఉంటాడని భావించిన స్థానికులు అతన్ని చితకబాది కాళ్లు చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదిలాబాద్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వినోద్‌గా గుర్తించారు. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో అసలు వారిద్దరికి ఎలా పరిచయం అయిందనే వివరాలు తెలియరాలేదు. ఇన్‌స్పెక్టర్ సత్తయ్య మాట్లాడుతూ మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని అన్నారు. మృతుడితో ఉన్న కానిస్టేబుల్ వినోద్‌ను విచారిస్తామని చెప్పారు.

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి
ఇబ్రహీంపట్నం, జూన్ 8: అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్‌యుటిఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా ఎన్‌రోల్‌మెంట్ జాతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యకు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ప్రజలు తమ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి విద్యనందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50 లక్షలను తన నిధులను కేటాయించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు వెచ్చించి పాఠశాలలను అభివృద్ధి పరుస్తామని, విద్యార్థులను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని సూచించారు. టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి మాణిక్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు నర్సింహాచారి మాట్లాడుతూ నేటి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ బడులను మార్చుకోవాలని, విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించి నాణ్యమైన విద్యనందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్వీ రమణారెడ్డి, కౌన్సిలర్ ఆకుల యాదయ్య, టిఎస్‌యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ గాలయ్య, నాయకులు రాజశేఖర్, శ్రీధర్, రాములయ్య, అనీల్‌కుమార్, బుగ్గరాములు, శ్రీకాంత్, కిషన్‌నాయక్, ఆనంద్, సుందరయ్య, శ్రీశైలం, చంద్రయ్య పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో చైన్‌స్నాచర్లు
గచ్చిబౌలి, జూన్ 8: ఐటి కారిడార్‌లో మంగళవారం హల్‌చల్ చేసిన ఇద్దరు చైన్‌స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కూకట్‌పల్లిలోని గాయత్రి కళాశాలలో చదివి ఇంటర్ ఫేయిల్ అయిన యువకులు ఉన్నట్లు సమచారం. కృష్ణా జిల్లా పమర్రుకు చెందిన ఉపేంద్రనాథ్ కుమారుడు నాగబాబు(22), శం