హైదరాబాద్

నేడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: గ్రేటర్ హైదరాబాద్ ప్రజల నీటి దాహార్తిని తీరుస్తున్న కృష్ణా ఫేజ్-3కి సంబంధించిన కోదండాపూర్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఎలక్ట్రికల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు పలు మరమ్మతులు చేపడుతున్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరాను తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు నిలిపివేయడంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం నీటి సరఫరా ఆలస్యంగా, అతితక్కువగా సరఫరా అవుతుందని జలమండలి అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
* నీటిసరఫరా ఆలస్యంగా, అతితక్కువగా సరఫరా అయ్యే ప్రాంతాలు: ఎల్‌బినగర్, వనస్థలిపురం, వాసవికాలనీ, అల్కాపురి, ఆటోనగర్, బిఎన్ రెడ్డినగర్, ముసారాంబాగ్, ఆల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, ఎంఇఎస్, లోతుకుంట, ఎంఇఎస్, డిఫెన్స్ కాలనీ, ఆర్‌కె పురం, సైనిక్‌పురి, సాయినాథ్‌పురం, గాయత్రినగర్, ఆనంద్‌బాగ్, నేరేడ్‌మెట్, సఫిల్‌గూడ, మల్కాజిగిరి, చైతన్యపురి, గౌతంనగర్, వౌలాలి, రాధికా థియేటర్ కుషాయిగూడ, ఓయుటి, మహేష్‌నగర్, కాప్రా, హెచ్‌బి కాలనీ, చర్లపల్లి, నాచారం, చిలుకానగర్, బీరప్పగడ్డ, ఉప్పల్, కైలాస్‌గిరి, తుర్కపల్లి, ఐసిఐసి నాలెడ్జ్ పార్క్, సింగపూర్ టౌన్‌షిప్, ప్రశాంత్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, బోరబండ, హస్మత్‌పేట్, బోజగుట్ట, ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, రాజేంద్రనగర్.