హైదరాబాద్

బ్లాక్ మెయిల్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: జూనియర్ ఆర్టిస్టు కాలె శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో 13 మంది నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ‘స్టూడియో9’ టివి ఛానెల్ సిఇఓ శివకుమార్, సిఐడి హోంగార్డ్ జగదీష్ ఉన్నారు. ఇటీవల జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ తన ఫ్లాట్‌లో వ్యభిచారం నడిపిస్తున్నాడంటూ బెదిరించి ఈ ముఠా అతణ్ణి రూ.రెండు లక్షలు డిమాండ్ చేసింది. ఆ మొత్తం ఇవ్వకపోవటంతో అతణ్ణి ఏకంగా కిడ్నాప్ చేసింది. ఎలాగోలా బయటపడ్డ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మహమ్మద్ జలీల్, ఎర్ల జగదీశ్వర్ రెడ్డి, జి రాజు, శివకుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ కిడ్నాప్ కేసులో మరో ఏడుగురు ఉన్నారని సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం మిగతా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ముఠానే శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ఐదుగురు మహిళలే కావడం విశేషం. 13 మంది సభ్యులతో ఏర్పడిన ముఠాలో ఇద్దరు విలేకరులు, ఓ టివి ఛానెల్ సిఇఓ, సిఐడి హోంగార్డు కీలకం. ఇప్పటి వరకు వీరు నగరంలో అనేక వసూళ్లకు పాల్పడినట్టు వెస్ట్‌జోన్ పోలీసులు తెలిపారు. జూనియర్ అర్టిస్టు శ్రీనివాస్ కిడ్నాప్ కేసు దర్యాప్తుతో ఈ తతంగం బయటపడిందని, వీరిలో షేక్ సలీం, లక్ష్మి దుర్గ, విజయ దుర్గ, గౌరి, రాజి, విజయ అనే మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపిసిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎసిపి ఉదయ్ కుమార్ తెలిపారు.