హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం తీవ్రతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 9: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో, ఢిల్లీలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఛలో ఢిల్లీ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. జాతి కోసం - మేము సైతం అనే నినాదంతో జూలై 19 నుంచి ఆగస్టు 12 వరకు ఢిల్లీలో మహాప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మాదిగల పట్ల చిన్నచూపు, అణచివేతను మానుకోవాలని, వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలని కోరారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూన్ 9 గురువారం ముఖ్యమంత్రి సొంత ఊరు చింతమడక నుంచి పాదయాత్రను ప్రారంభించినట్టు చెప్పారు. అదే విధంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థుల చైతన్య సైకిల్ యాత్రను నిర్వహిస్తామని చెప్పారు. జూలై 18 వరకు రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఈ యాత్రలు కొనసాగుతాయని, అనంతరం జూలై 19 నుంచి ఢిల్లీలో తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. తమకు అధికారం వస్తే వందరోజుల్లో వర్గీకరణ పూర్తిచేస్తామని చెప్పిన బిజెపి దాన్ని మరిచిపోయిందని ఆ విషయాన్ని గుర్తుచేస్తూ తమ పోరు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి మాదిగ, రమేష్, గోవింద్, పురుషోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.