హైదరాబాద్

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు చేసిన ఉచిత చేప ప్రసాదం పంపిణీ గురువారం ఉదయంతో ప్రశాంతంగా ముగిసింది. నిరుటి కన్నా ఈసారి ఎక్కువ మంది ఈ ప్రసాదం తీసుకునేందుకు వస్తున్నట్లు ముందస్తు సమాచారం రావటంతో ప్రసాదం పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు రచించిన బందోబస్తు వ్యూహం ఫలించింది. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ నిరాటంకంగా ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగి గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం ప్రసాదం పంపిణీ ప్రారంభ సమయంలో ఒక్కసారిగా బ్యారికేడ్లలోని జనం ముందుకు తోసుకుంటూ రావటంతో స్వల్ప తోపులాట మినహా ఇరవై నాలుగు గంటల చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ చేప ప్రసాదంలో శాస్ర్తియత లేదని, ఆస్తమా వ్యాధిని తగ్గించే ఔషధ గుణాలు కూడా లేవంటూ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ప్రతికూల ప్రచార ప్రభావం ఈసారి బాగా తగ్గింది. గతంతో పోల్చితే ఈసారి ఎక్కువ మంది చేప ప్రసాదం తీసుకున్నారని చెప్పవచ్చు. నిరుడు 61వేల కొర్రమీను చేప పిల్లలు అమ్ముడుపోగా, ఈసారి 63వేల 600 వరకు అమ్ముడుపోయాయి. దీనికి తోడు బెల్లంతో ఈ ప్రసాదాన్ని తీసుకునే వారి సంఖ్య మరో పదివేల వరకుంటుంది. మొత్తం 70వేల పైచిలుకు మంది ఈసారి ప్రసాదాన్ని తీసుకున్నట్లు చెప్పవచ్చు. బుధవారం అర్ధ రాత్రి వరకు సుమారు 52వేల మందికి చేప పిల్లలను విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఇదే సంఖ్య ఉదయం ఎనిమిదిన్నర గంటల కల్లా 61వేలకు చేరగా, ముగింపు సమయం కల్లా 63వేల 600కు పెరిగింది. బత్తిని హరినాథ్ గౌడ్ మాత్రం తాము లక్ష మందికి చేప ప్రసాదం వేసినట్లు చెప్పారు.
మరో 4 రోజులు అందుబాటులో ప్రసాదం
ఆస్తమా రోగులకు బత్తిని కుటుంబీకులు అందజేసే చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ముగిసినా, మరో నాలుగు రోజుల పాటు బత్తిని కుటుంబీకుల నివాసాల వద్ద అందుబాటులో ఉంటుందని హరినాథ్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలోని దూద్‌బౌలీ, కవాడిగూడ, ఉప్పల్, ఘాన్సీబజార్ ప్రాంతాల్లో ఈ ప్రసాదం అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.