హైదరాబాద్

సికింద్రాబాద్ కోర్టులో న్యాయవాదుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జూన్ 10: తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని సికింద్రాబాద్ న్యాయవాదుల జెఎసి నాయకుడు కొమురయ్య చెప్పారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగకుండా జెఎసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనలో భాగంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 42 మంది జడ్జిలు తెలంగాణ ప్రాంతానికి అప్షన్ పెట్టుకోవటంతో తెలంగాణ వారికి రాబోయే 30 సంవత్సరాల వరకు జడ్జీలు ఆయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినా న్యాయవ్యవస్థలో తెలంగాణ వారికి మళ్లీ అన్యాయం జరుగుతుందని వివరించారు. సికింద్రాబాద్ లో ఉన్న 13 మంది జడ్జిల్లో ప్రస్తుతం ఆందరూ ఆంధ్రప్రాంతం వారే ఉన్నారని, హైకోర్టు విభజన జరిగినా ప్రస్తుతమున్న వారు ఇక్కడే ఉంటే కొత్త వారికి అవకాశాలు రావని చెప్పారు.
జడ్జీలు కూడా ఎక్కడ స్వస్థలం అయితే అక్కడే ఆప్షన్ పెట్టుకోవాలని, దాంతో ఇక్కడి వారికి అవకాశాలు వస్తాయని అలా సాధించే వరకు న్యాయబద్ధమైన పోరాటం చేస్తామని వివరించారు.
శనివారం సికింద్రాబాద్‌లో జరిగే నేషనల్ లాడే కూడా బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. నిరసన కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వెంటనే సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.