హైదరాబాద్

హరితహారానికి కళాకారులు అకుంఠిత దీక్షతో కదలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: హరితహారం ప్రచారానికి కళాకారులు అకుంఠిత దీక్షతో పాల్గొనాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో తెలంగాణ కళాకారుల సమీక్ష సమావేశం శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. రామన్న మాట్లాడుతూ కళాకారులు ఓ వర్గానికి, పార్టీకి చెందినవారు కాదని సైమైఖ్యతా భావంతో అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. వృక్ష సంపద తగ్గితే మానవ సమాజం మనుగడ కోల్పోతుందని చెప్పారు. ఒకేరోజు కోటి మొక్కలను నాటాలని ప్రణాళిక తయారు చేస్తున్నామని వివరించారు. మొక్కల పెంపకంపై అవగాహన సదస్సుల్లో పాల్గొన్న సాంస్కృతిక సారధి కళాకారులను రామన్న అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యమంలో ప్రజలు ఎలా పాల్గొన్నారో అభివృద్ధిలోనూ పాలుపంచుకోవాలని అన్నారు. కళాకారులకు ఐదులక్షల జీవితబీమా, వైద్యానికి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వికాసరాజ్ పాల్గొన్నారు.