హైదరాబాద్

గులాబీ పరిమళమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: రంగారెడ్డి జిల్లాలో గులాబీ గుబాళించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను టిఆర్‌ఎస్ దక్కించుకుంది. రాజేందర్‌నగర్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, స్వతంత్ర అభ్యర్థులు తమకు భారీగా ఓట్లు వస్తాయని ఎవరికివారు వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే విజయం సాధించుకుంటామని భావించిన టిఆర్‌ఎస్ అభ్యర్థులు మూడు రౌండ్‌లోగాని బయటపడలేదు. మొదటి ప్రాధాన్యతగా టిఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి 239 ఓట్లు రాగా, టిఆర్‌ఎస్ రెండవ అభ్యర్థి సుంకరి రాజుకు 236 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌కు 135 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి బుక్క వేణుగోపాల్‌కు 96 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 50 ఓట్లు రాగా 12 ఓట్లు చెల్లని ఓట్లు వచ్చాయి. అయితే 257 ఓట్లు వస్తేగానీ తొలి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించినట్లు ప్రకటించాల్సి ఉండగా ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో ఎలిమినేషన్ ఓట్లను లెక్కించారు. అశోక్‌కు వచ్చిన 50 ఓట్లను రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించడంతో 18 ఓట్లు పట్నం నరేందర్ రెడ్డికి వచ్చాయి. దీంతో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం రెండవ ఎలిమినేషన్ అభ్యర్థి బుక్కా వేణుగోపాల్‌కు వచ్చిన 96 ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించడంతో 28 ఓట్లు లభించాయి. దీంతో సుంకర రాజును విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి ప్రకటించారు. అనంతరం రెండు స్థానాలను టిఆర్‌ఎస్ కైవశం చేసుకోవడంతో అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులు విజయోత్సవాల్లో మునిగి తేలారు.