హైదరాబాద్

పోలియో నివారణకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వెలుగు చూసిన పోలియో వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన స్పందించాలని, ఈ విషయంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని బిజెపి శాసన సభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని ఎక్కడ చూసిన రోడ్లపై చెత్తాచెదారం దర్శనమిస్తోందన్నారు. పోలియో రహిత దేశమైన భారతదేశంలో ప్రధానంగా హైదరరాబాద్ మహానగరంలో పోలియో వైరస్ శాంపిల్స్ బయట పడటం తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్‌పేట్‌లోని నాలాలో పోలియో వైరస్‌ను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ తదితర సంస్ధలకు చెందిన ప్రతినిధులు నగరంలో పరిశోధనలు జరుపుతున్నారని అన్నారు. మురుగు నీటి కాలువల్లో, మురుగు నీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్‌టిపి)లో పోలియో వైరస్ శాంపిల్స్ లభించయాని ఇది ఎంతో ఆందోళనను కలిగిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో పోలియో వైరస్‌ను అరికట్టడానికి వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నైజిరీయాలో వైరస్ అనావాళ్లున్నాయని, అక్కడి వారు నగరంలో ఉండటంతో పోలియో వైరస్‌వ్యాపించి ఉండవచ్చని అధికారులు తెలుపుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పోలియో నివారణకు హైలెవల్ కమిటీని నియమించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అంబర్‌పేట్‌లో ఉన్న ఎస్‌టిపి మూలంగా భరించలేని దుర్వాసనతో పాటు స్థానికంగా భుగర్భ జలాలు కలుషితం అయ్యయని ఆరోపించారు. నగరంలో ఉన్న పలు ఎస్‌టిపిల కారణంగా స్థానికంగా నివాసం ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జలమండలి.. పరిశుద్ధమైన నీటిని సరఫరా చేయాలని, కలుషిత నీరు సరఫరా జరుగాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి ఖైర్‌తాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం బోర్డు ఎండి దానకిశోర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ట్యాంక్‌బండ్, కూకట్‌పల్లి పారిశ్రామికవాడలు తదితర ప్రాంతాల నుంచి వస్తున్న మురుగు నీరు అంబర్‌పేట్ నుండి వెళ్లే నాలాలో కలుస్తొందన్నారు. వందల కోట్ల రూపాయాలు వెచ్చించి మూసీ సుందరీకరణ పనులను చేపట్టిన ఫలితం శూన్యమేనని మండిపడ్డారు. నగరంలో పోలియో శాంపిల్స్ లభించడంపట్ల విఫలమైన సంబంధిత శాఖల అధికారులపై కఠినంగా వ్యవహరించాలని, ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెపుతున్న ప్రస్తుతం పోలియో వైరస్ నగరంలో వెలుగు చూడడమేనా అని ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఈనెల 19 నుంచి 25 వరకు అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఇంటింటికీ సర్వే నిర్వహించి మూడు సంవత్సరాలలోపు వయసు కలిగినవారి వివరాలను సేకరించి దాదాపు ఆరు వందల కేంద్రాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలను వేస్తామని అన్నారు.
చర్యలు తీసుకుంటాం
హైదరాబాద్ నగరంలో వైరస్ శాంపిల్స్ వెలుగు చూడటంతో జలమండలి పరిధిలోని ఎస్‌టిపిలతో స్థానిక ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుంటడా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండి దానకిశోర్ తెలిపారు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులతో చర్చించి వార సూచించే సూచనలు, సలహాలు తప్పకుండా పాటిస్తామని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి ఎండి వివరించారు. జలమండలి ఎండిని కలిసిన వారిలో తెలంగాణ బిజెపి వైద్యుల విభాగం కన్వీనర్ డాక్టర్ సురేష్‌గౌడ్ ఉన్నారు.