హైదరాబాద్

దేశీయ విత్తనాలతో సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 2: దేశీయ విత్తనాలతో సంపూర్ణ ఆరోగ్యం, అధిక దిగుబడులు సాధ్యమని సేవ్ (సొసైటీ ఫర్ అవరైనెస్ అండ్ విజన్ ఆన్ ఇన్విరాన్‌మెంట్) సంస్థ నిర్వాహకులు, ప్రకృతి రైతు విజయరాజు అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవాళీ విత్తనాలు పూర్తిగా కనుమరుగవడం ఎంతో ఆవేదన కలిగించే అంశమని అన్నారు. విత్తనం అనేది భగవంతుడు ఇచ్చిన సృష్టి అని, ఆయా భూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనం తన మనుగడ సాగిస్తుందని చెప్పారు. దేశంలో హరిత విప్లవం ప్రారంభం అయిన తరువాత దేశీయ విత్తనాలు వాడకం పడిపోతూ వచ్చిందని అన్నారు. భవిష్యత్ తరాలకు దేశీయ విత్తనాలు అందించాలనే లక్ష్యంతో తాను గత ఐదు సంవత్సరాలుగా విత్తనాల అభివృద్ధిపై దృష్టి సారించి, ఐదు టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఈనెల 8, 9, 10 తేదీల్లో అమరావతి, మనగ్రామంలో వీటిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నగరంలోని రామకృష్ణా మఠం ఆడిటోరియంలో వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. పంపిణీ సమయంలో ప్రకృతి వ్యవసాయం వల్ల చేకూరే ప్రయోజనాలు, వాటి పద్ధతులు వివరిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040-27654337 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.