హైదరాబాద్

మహా గణపతి విగ్రహ పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 22: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహతయారీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శిల్పి రాజేందర్ పనులకు శ్రీకారం చుట్టారు. బుధవారం గణపతి కొలువుదీరనున్న బేస్‌లకు వెల్డింగ్ చేశారు. అనంతరం 48 అడుగుల ఎత్తు కలిగిన భారీ ఇనుప స్థంభాన్ని ఏర్పాటు చేశారు. 58 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమివ్వనున్న శంకర తనయుడి విగ్రహానికి తగినట్టుగా బేస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు శిల్పి రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఈ పనుల్లో 15 మంది పనివారు నిమగ్నం అవుతుండగా మునుముందు సుమారు 100 మంది వరకు విగ్రహ తయారీలో భాగస్వాములౌతారు. ఈ ఏడు ఏకదంతుడు భక్తులకు విష్ణువు రూపంలో దర్శనమివ్వనున్నాడు. గణపతి ఆకారం ఎలా ఉండాలన్న దానిపై స్పష్టతకు వచ్చిన నిర్వాహకులు ఇరువైపులా ఏఏ దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలనే విషయంపై సిద్ధాంతుల సలహాలను తీసుకుంటున్నారు. విగ్రహ పూర్తినమూనాను వారం రోజుల్లో విడుదల చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. వినాయక చవితికి వారం ముందే ఏర్పాటును పూర్తిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు రాజేందర్ తెలిపారు.
సమస్యల కారణంగానే..!
ఖైరతాబాద్ మహా రూపానికి తగ్గట్టుగా భారీ లడ్డూను రూపొందించి ఏర్పాటు చేయడం అనవాయితీగా ఉండేది. కాగా ఈసారి అంతటి లడ్డూ గణనాథుని హస్తంలో కనిపించక పోవచ్చు. ప్రతిసారి ఎంతో భక్తిశ్రద్ధలతో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు భారీ వినాయకుడికి తగ్గట్టుగా భారీ లడ్డూను ఇచ్చేవారు. మల్లిబాబు ఎంతో భక్తితో అందిస్తున్న లడ్డూ విషంయలో స్థానికులు రాద్ధాంతం చేయడం సమస్యగా మారింది.
రెండువేల కేజీల లడ్డూ అందిస్తున్న మల్లిబాబు తన స్వగ్రామానికి అందులో కొంత లడ్డూను ప్రసాదంగా పంచడానికి తీసుకువెళ్లేందుకు బతిమిలాడాల్సిన పరిస్థితి. గత ఏడాది ఉత్సవ కమిటీ సభ్యుల సమ్మతితో ప్రత్యేక వాహనంలో లడ్డూను తీసుకువెళుతుండగా ఆ వాహనాన్ని వెంబడించి లడ్డూను దోచుకోవడం వంటి సంఘటనల నేపథ్యంలో ఈసారి లడ్డూను పెట్టేందుకు ఆయన ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. దీనికి తోడు అన్నట్టు లడ్డూ పంపిణీ ప్రతి ఏడు పెనుసవాలుగా మారుతోంది. లడ్డూను దోచుకునేందుకు ప్రత్యేక పన్నాగాలు వేయడం అక్కడ ఉన్నవారిని బెదిరించి లాక్కొని వెళ్లడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో 11 రోజుల పాటు గణపతికి రక్షణగా ఉన్న పోలీసులు లడ్డూకోసం మరో రెండు రోజులు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాల్సి వచ్చేది. లడ్డూ పంపిణీ రోజు సైఫాబాద్ పోలీసులకు అగ్నిపరీక్షలా ఉండేది. కొద్దిపాటి ప్రసాదం దొరికినా చాలనుకునే భక్తులు భారీ క్యూలో ఉంటే మేం స్థానికులం మాకు ఇవ్వరా అంటూ వచ్చిపడే వారిని అదుపు చేయడం తలకు మించిన భారంగా ఉండేది. మల్లిబాబు, ఉత్సవ కమిటీ నిర్ణయంతో ఈసారి అలాంటి తలనొప్పులు సైఫాబాద్ పోలీసులకు తప్పనున్నాయి.